Union Budget 2022: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చిన

Updated : 01 Feb 2022 11:06 IST

దిల్లీ: 2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చిన కేంద్ర మంత్రి.. పద్దు వివరాలను వెల్లడిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.

కరోనా మూడో ఉద్ధృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌పై యావత్ దేశం ఆసక్తిగా ఉంది. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనందుకు ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక వేతనజీవులకు కొంతమేర ఉపశమనం లభించొచ్చని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని