Uniparts IPO: ప్రారంభమైన యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ.. పూర్తి వివరాలివే
యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ ఈరోజు ప్రారంభమైంది. డిసెంబరు 2 వరకు కొనసాగనుంది. రూ.836 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దిల్లీ: యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ (Uniparts India IPO) నేడు ప్రారంభమైంది. డిసెంబరు 2 వరకు షేర్ల సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగనుంది. రూ.836 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయిస్తున్నారు. ఈ కంపెనీకి అంతర్జాతీయంగా క్లైంట్లు ఉన్నారు. ఆయా సంస్థలు విక్రేతల్ని పెంచుకుంటుండడంతో యూనిపార్ట్స్‌కు ప్రయోజనం చేకూరుతోంది.
ఐపీఓ కీలక వివరాలు..
- ధర శ్రేణి: రూ.548- 577
- బేసిస్ ఆఫ్ అలాట్‌మెంట్ తేదీ: డిసెంబరు 7
- రీఫండ్ల ప్రారంభం: డిసెంబరు 8
- డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ: డిసెంబరు 9
- లిస్టింగ్ తేదీ: డిసెంబరు 12
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు: 25 (ఒక లాట్)
- ఒక్కో షేరు ముఖ విలువ: రూ.10
- వివిధ వర్గాలకు షేర్ల కేటాయింపు తీరు..
- అర్హతగల సంస్థాగత మదుపర్ల వాటా: గరిష్ఠంగా 50 శాతం
- సంస్థాగతేతర మదుపర్ల వాటా: కనిష్ఠంగా 15%
- చిన్న మదుపర్లు: కనిష్ఠంగా 35%
ప్రమోటర్లు 14,481,942 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. ప్రమోటర్ సంస్థలైన కరణ్ సోనీ 2018 సీజీ-ఎన్‌జీ నెవాడా ట్రస్ట్, మెహర్ సోనీ 2018 సీజీ-ఎన్‌జీ ట్రస్ట్, పమేలా సోనీతో పాటు ప్రమోటర్లు అశోకా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్, అంబాదేవీ మారిషస్ హోల్డింగ్ తమ వాటాల్లో కొంత భాగాన్ని ఐపీఓలో విక్రయించనున్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ అయిన నేపథ్యంలో సమీకరించిన నిధుల్ని కంపెనీ వినియోగించుకునే ఆస్కారం లేదు. 2014, 2018లోనూ యూనిపార్ట్స్ ఐపీఓకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంది. సెబీ నుంచి అనుమతి కూడా లభించింది. కానీ, వివిధ కారణాలరీత్యా వాయిదా వేసుకుంది. యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, జేఎం ఫైనాన్షియల్ తాజా ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
యూనిపార్ట్స్ ఇండియా దాదాపు 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వ్యవసాయం, నిర్మాణం, అటవీ, మైనింగ్ వంటి రంగాలకు ఇంజినీరింగ్ సిస్టమ్స్ ఉత్పత్తులతో పాటు సేవలను అందజేస్తోంది. 3-పాయింట్ లింకేజ్ సిస్టమ్స్, ప్రెసిషన్ పార్ట్స్, పవర్ టేకాఫ్, హైడ్రాలిక్ సిలిండర్స్ ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి. 2019-2022 మధ్య కంపెనీ ఆదాయం ఏటా 18 శాతం వృద్ధితో రూ.1,274 కోట్లకు పెరిగింది. అదే సమయంలో నికర లాభాలు 62 శాతం పుంజుకున్నాయి. 2020లో 14.1 శాతంగా ఉన్న EBITDA ఆదాయం 2022 నాటికి 22.1 శాతానికి పెరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
Politics News
Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్ సూచన