Bank strike: 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంక్‌ ఉద్యోగులు రెండ్రోజుల పాటు సమ్మెకు దిగనున్నారు. జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల సమాఖ్య తెలిపింది.

Published : 12 Jan 2023 19:48 IST

దిల్లీ: తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు (Bank strike) దిగనున్నారు. జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) తెలిపింది. గురువారం ముంబయిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్ల సాధనకు ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఈ డిమాండ్లపై పలుమార్లు లేఖలు రాసినా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని