ఇకపై మాస్క్ పెట్టుకుని కూడా మొబైల్ అన్ లాక్ చేయండి..

ఈ కొత్త అప్‌డేట్ iOS 15.4 కలిగిన ఐఫోన్‌ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

Published : 15 Mar 2022 12:22 IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్ లను తయారు చేసే ఆపిల్, తమ వినియోగదారుల కోసం ఒక వినూత్నమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు ఫేస్ మాస్క్‌లను ధరించినప్పటికీ వారి ఐఫోన్‌లను అన్‌లాక్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ iOS 15.4 కలిగిన ఐఫోన్‌ లకు మాత్రమే, అంటే ఐఫోన్ 12,12 Mini, 12 Pro, 12 Pro Max, iPhone 13, 13 Mini, 13 ప్రో, 13 ప్రో మాక్స్ మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు అనేక ఇతర ఫీచర్‌లను కూడా ఆపిల్ తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. 

వినియోగదారులు తమ ఐఫోన్ ను అప్‌డేట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై 'ఫేస్ ఐడి విత్ మాస్క్‌' అనే ఆప్షన్ చూడవచ్చున్నని ఆపిల్ తెలిపింది. దీనితో పాటు 'ఎయిర్‌ట్యాగ్' సెటప్ చేసే సమయంలో భద్రతా సందేశాలు, కొత్త సిరి వాయిస్, ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా సమయం, తేదీ వంటి ప్రశ్నలకు సమాధానమివ్వగల సామర్థ్యం లాంటి మరికొన్ని ఫీచర్‌లను కూడా ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని