PM kisan eKYC: దగ్గర పడుతున్న పీఎం కిసాన్ ఇ-కేవైసీ గడువు.. ఇలా చేసుకోండి..

PM kisan eKYC: పీఎం-కిసాన్ నిధుల‌ను పొందేవారి పేరు త‌ప్ప‌నిస‌రిగా లబ్ధిదారుల జాబితాలో ఉండాలి.

Updated : 20 Jul 2022 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం పీఎం కిసాన్‌ (PM kisan). రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అందించాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. సంవ‌త్స‌రానికి మూడు దఫాల్లో రూ.6 వేలు రైతుల‌ ఖాతాకు నేరుగా జ‌మ చేస్తోంది. ఒక్కో విడతలో ఒక్కో రైతుకి రూ.2 వేలు చొప్పున విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. 2022 మే 31న ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద 10 కోట్ల మంది రైతుల‌కు 11వ విడ‌త ఆర్థిక ప్ర‌యోజ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి పంపిణీ చేశారు.

అయితే, ఈ ఆర్థిక ప్ర‌యోజ‌నం పొంద‌డానికి పీఎం-కిసాన్ వెబ్‌సైట్‌లోని ఇ-కేవైసీ (PM kisan eKYC)ని పూర్తి చేయాలి. ఇందుకోసం 2022 జులై 31ని గడువుగా నిర్ణయించారు. గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇ-కేవైసీని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం..

పీఎం-కిసాన్ ఇ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?
1. పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించండి https://pmkisan.gov.in/

2. సైట్ కుడి వైపున అందుబాటులో ఉన్న eKYCపై క్లిక్ చేయండి.

3. ఆధార్ కార్డ్ నంబ‌ర్‌, CAPCHA కోడ్‌ని న‌మోదు చేసి Searchపై క్లిక్ చేయండి.

4. ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబ‌ర్‌ను న‌మోదు చేయండి.

5. GET OTPపై క్లిక్ చేసి, పేర్కొన్న ఫీల్డ్‌లో OTPని న‌మోదు చేయండి.

అన్ని వివ‌రాలు స‌రిపోలితే.. eKYC పూర్త‌వుతుంది. లేకుంటే అది చెల్ల‌నిదిగా కనిపిస్తుంది. అటువంటి సంద‌ర్భాల్లో మీరు స్థానిక ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.

పీఎం నగదు జమయ్యిందా?

1. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించండి https://pmkisan.gov.in/

2. వెబ్‌సైట్ పేజీలో కుడి వైపు ఉన్న BENEFICIARY STATUS ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. ఆధార్ నంబ‌ర్ లేదా ఖాతా నంబ‌ర్‌ని న‌మోదు చేయండి.

4. GET DATA  ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

లబ్ధిదారుని స్థితి వివ‌రంగా స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. పీఎం-కిసాన్ నిధుల‌ను పొందేవారి పేరు త‌ప్ప‌నిస‌రిగా లబ్ధిదారుల జాబితాలో ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని