UPI: ఫీచర్‌ ఫోన్‌తో యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

UPI 123PAYతో..40 కోట్ల కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు వెబ్‌కు యాక్సెస్ లేకపోయినా విస్తృతమైన ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించవచ్చు.

Published : 28 Jan 2023 20:17 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఫీచర్ మొబైల్ ఫోన్‌ల కోసం కొన్ని నెలల క్రితం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)ని విడుదల చేసింది. ఫీచర్ ఫోన్‌లు మాత్రమే ఉన్నవారు డిజిటల్ లావాదేవీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. UPI 123PAYతో..40 కోట్ల కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు వెబ్‌కు యాక్సెస్ లేకపోయినా విస్తృతమైన ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించవచ్చు. 123పేతో, ఐవీఆర్‌(ఇంటరాక్టివ్ వాయిస్‌ రెస్పాన్స్‌) ద్వారా గానీ, ఫీచర్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా గానీ, మిస్డ్‌కాల్‌ విధానం ద్వారా గానీ, ప్రోక్సిమిటి సౌండ్‌ ద్వారా గానీ చెల్లింపులు చేయవచ్చు.

123పే ద్వారా యూపీఐ ఐడి క్రియేట్‌ చేసే విధానం..

  • మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబరు ద్వారా మీ ఫీచర్‌ ఫోన్‌ నుంచి ఐవీఆర్‌ నంబరు(080 4516 3666, 080 4516 3581, or 6366 200 200) డయల్‌ చేయండి.  
  • ఐవీఆర్‌ కాల్‌ ద్వారా మీరు, ఏ బ్యాంకు ఖాతాను యూపీఐ బ్యాంకింగ్‌కు రిజిస్టర్‌ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు పేరు తెలుపండి.
  • మీరు తెలిపిన బ్యాంకులో.. మీకు ఉన్న అన్ని ఖాతాలు కనిపిస్తాయి. కావాల్సిన బ్యాంకు ఖాతాను ఎంచుకుంటే..mobile.voice@psp ఫార్మెట్‌లో యూజర్‌ ఐడిని ఇస్తారు.
  • ఇక్కడ వినియోగదారులు యూపీఐ పిన్‌ నంబరును సెట్‌ చేసుకోవాలి. ఇందుకోసం మీ బ్యాంకు డెబిట్‌ కార్డులోని చివరి ఆరు అంకెలు, అలాగే బ్యాంకు నుంచి మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన సమాచారం ధ్రువీకరించిన తర్వాత మీరు 4/6 అంకెల యూపీఐ పిన్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. 
  • మీరు ఇంతకు ముందే యూపీఐ పిన్‌ను సెట్‌ చేసుకొని ఉంటే పైన తెలిపిన స్టెప్‌ను స్కిప్‌ చేయవచ్చు. మీరు అనుసంధానించుకున్న బ్యాంకు ఖాతా ఆధారంగా యూజర్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తారు. 
  • పైన తెలిపిన విధానం ద్వారా రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత ఐవీఆర్‌ నంబరుతో 123పే సేవలను ఉపయోగించుకుని డిజిటల్‌ చెల్లింపులు చేయవచ్చు. 

డబ్బు ఎలా బదిలీ చేయాలి?

  • నమోదిత ఫీచర్‌ ఫోన్‌ నుంచి ఐవీఆర్‌ నంబరును(080 4516 3666, 080 4516 3581, లేదా 6366 200 200) డయల్ చేస్తే, మెయిన్‌ మెనూలో 1.మనీ ట్రాన్సఫర్‌, 2.బ్యాలెన్స్‌ చెక్‌, 3.మొబైల్‌ రీఛార్జ్‌, 4.ఎన్‌ఈటీసీ రీఛార్జ్‌, 5.సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. మీరు ఏ సేవ కావాలనుకుంటున్నారో సంబంధిత నంబరును ఎంటర్‌ చేయాలి. 
  • ఇక్కడ మీరు ‘మనీ ట్రాన్స్‌ఫర్’ కోసం ‘1’ ప్రెస్‌ చేయాలి. 
  • డబ్బు పంపించడానికి ముందు మీరు రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేసినట్లు ధ్రువీకరించండి. 
  • ఇప్పుడు ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో ఆ లబ్ధిదారుడి ఫోన్‌ నంబరును, బదిలీ చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్‌ చేయండి. 
  • యూపీఐ పిన్‌ నమోదు చేస్తే, మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయ్యి, లబ్ధిదారు ఖాతాకు క్రెడిట్‌ అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని