UPI new Record: యూపీఐ కొత్త రికార్డ్‌.. తొలిసారి ₹10 లక్షల కోట్ల మార్క్‌

డిజిటల్‌ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) మరో కొత్త రికార్డు నెలకొల్పింది.

Published : 02 Jun 2022 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) మరో కొత్త రికార్డు నెలకొల్పింది. యూపీఐ ద్వారా చేసిన లావాదేవీల విలువ మే నెలలో ₹10 లక్షల కోట్లు దాటాయి. యూపీఐ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఒక నెలలో ఇంత మొత్తంలో లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. మే నెలకు సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది.

మే నెలలో మొత్తం 595 కోట్ల లాదావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఏప్రిల్‌ నెలలో 558 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది. గతేడాది మే నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు ఉండగా.. ఈ సారి రెట్టింపు అవ్వడం గమనార్హం. 2016లో యూపీఐ సేవలు అందుబాలోకి వచ్చాయి. విస్తృత వాడకంలోకి వచ్చింది మాత్రం కరోనా మహమ్మారి కారణంగానే. 2020 నుంచి ఈ సేవలకు ఎనలేని ఆదరణ పెరిగింది. ఆ ఏడాది మార్చిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 124 కోట్లు కాగా.. వాటి విలువ ₹2.06 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం ₹10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోగా.. రాబోయే 2-3 ఏళ్లలో ₹100 కోట్లకు చేరుకోవాలని ఎన్‌పీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని