TCS: వాణిజ్య రహస్యాలు దుర్వినియోగం కేసు.. టీసీఎస్‌కు ₹1,600 కోట్లు జరిమానా

TCS: వాణిజ్య రహస్యాలు బయటపెట్టారన్న కారణంతో అమెరికా డిస్ట్రిక్‌ కోర్ట్‌ టీసీఎస్‌కు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది.

Updated : 15 Jun 2024 20:37 IST

TCS | ఇంటర్నెట్‌డెస్క్‌: వాణిజ్య రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు అమెరికా కోర్టు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది. తమ వ్యాపార రహస్యాలను బయటపెట్టిందని ఆరోపిస్తూ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (CSC) (ప్రస్తుతం DXC టెక్నాలజీ కంపెనీ) టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్‌ కోర్ట్‌ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. మొత్తం 194.2 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్లు) చెల్లించాలని పేర్కొంది. 

‘మౌస్‌ జిగ్లింగ్‌’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?

ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో టీసీఎస్‌ పేర్కొంది. ఈమేరకు జూన్‌ 14న కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపింది. అయితే ఈ తీర్పు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని పేర్కొంది. ఈ చట్టపరమైన సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ విషయంలో తమవైపు బలమైన వాదనలు ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. రివ్యూ పిటిషన్/అప్పీల్‌కు వెళ్లాలని చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని