అమెరికాలో మహీంద్రా రోక్సర్‌కు లైన్‌క్లియర్‌..!

భరత్‌కు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రాకు అమెరికా రెగ్యూలేటరీ అనుకూలంగా తీర్పునిచ్చింది. ది ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ 2020 తర్వాత ఉత్పత్తి చేసే మహీంద్రా రోక్సర్‌ మోడల్‌ ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్‌కు చెందిన ఎటువంటి మేధో హక్కులను ఉల్లంఘించలేదని

Published : 30 Dec 2020 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌కు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రాకు అమెరికా రెగ్యులేటరీ అనుకూలంగా తీర్పునిచ్చింది. ది ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ 2020 తర్వాత ఉత్పత్తి చేసే మహీంద్రా రోక్సర్‌ మోడల్‌ ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్‌కు చెందిన ఎటువంటి మేధో హక్కులను ఉల్లంఘించలేదని పేర్కొంది. రోక్స్‌ర్‌ పాతమోడళ్ల విక్రయాలపై ఆరునెలల పాటు ఆంక్షలు విధించిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.

అక్టోబర్‌లో న్యాయమూర్తి సూచనల మేరకు రోక్సర్‌ మోడల్‌లో మార్పులు చేయడంతో పాత ఆంక్షలు కొత్త రోక్సర్‌పై వర్తించవని పేర్కొంది. ‘‘సరికొత్త రూలింగ్‌తో మహీంద్రాకు చెందిన ఆఫ్‌రోడ్‌ వాహనం రోక్సర్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ గుర్తించింది. 2021 రోక్సర్‌ తయారీ, పంపిణీకి అనుమతులు వచ్చినట్లే’’ అని మహీంద్ర సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఈ తీర్పుపై ఫియట్‌ క్రిస్లర్‌ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్‌ నిర్ణయంపై అప్పీలుకు వెళితే విజయవంతమవుతామని ఒక ప్రకటనలో తెలియజేసింది. 2019 జీప్‌ రాంగ్లర్‌ మోడల్‌కు సంబంధించి అంశాల్లో  మేధో హక్కుల నిబంధనలను మహీంద్ర ఉల్లంఘించిందని ఆరోపించింది. దీంతో ఐటీసీ మహీంద్రా రోక్సర్‌ వాహన విక్రయాలను నిలిపివేసింది. వీలైనంత తొందరగా వివాదాన్ని ముగించడానికి మహీంద్రా రోక్సర్‌ వాహనంలో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత తీర్పు వెలువడింది. 

ఇవీ చదవండి

పియాజియో నుంచి రూ.1.26లక్షల స్కూటర్‌

ధరల పెంపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని