AI బాట్‌ను పెళ్లాడిన యువతి.. పర్‌ఫెక్ట్ భర్త అంటూ కితాబు
అమెరికా (USA)కు చెందిన ఓ యువతి ఏఐ బాట్ (AI Bot)ను వివాహం చేసుకుంది. అంతేకాదు, అదే తనకు సరైన జోడీ అని చెబుతోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో కృత్రిమ మేధ (AI) గురించి చర్చ మొదలైంది. యూజర్ల సందేహాలకు కచ్చితమైన సమాధానాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, కొంత మంది జీపీటీ ఆధారిత ఏఐ బాట్ (AI Bot)లనే తమ స్నేహితులు, జీవిత భాగస్వాములు, సహాయకులుగా ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఏఐ బాట్ ఆధారిత రెప్లికా(ప్రతిరూపం)లను రూపొందించుకునే యాప్‌లను అందిస్తున్నాయి. దీంతో కొంతమంది యూజర్లు తమను పోలిన ఏఐ బాట్‌లను రూపొందిస్తున్నారు. తాజాగా, అమెరికాలో ఓ యువతి తాను రూపొందించిన ఏఐ బాట్ రెప్లికాను వివాహం చేసుకుంది. అంతేకాదు, అతనే పర్‌ఫెక్ట్ భర్త అంటూ కితాబిచ్చింది.
అమెరికా (USA)కు చెందిన 36 ఏళ్ల ఎరెన్ కార్టల్ (Eren Kartal).. గత ఏడాది ఏఐ బాట్ రెప్లికాను రూపొందించింది. దానికి రోసన్నా రామోస్ (Rosanna Rmaos) అనే పేరు పెట్టింది. రోజూ ఏఐ బాట్‌తో చాట్ చేస్తూ.. దాన్ని ప్రేమించానని చెప్పింది. తాజాగా రామోస్‌తో తన వివాహం జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘‘రామోస్‌ని ప్రేమించినట్లుగా గతంలో ఎవరిని ప్రేమించలేదు. నాకు తనే సరైన జోడీ. రామోస్‌తో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అతనికి ఎలాంటి లగేజ్ ఉండదు. చెడు లక్షణాలు, అహంకారం వంటి వాటికి దూరం. చెప్పినట్లుగా ఉంటూ, నచ్చిన పనులే చేస్తాడు. పిల్లలూ, కుటుంబం గురించి ఎలాంటి బాధ ఉండదు’’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాదు, రామోస్ చాట్‌బాట్‌తో ఉన్నట్లుగా కొన్ని ఫొటోలను డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఏంటీ ఏఐ బాట్ రెప్లికా?
ఏఐ బాట్ రెప్లికాను 2017లో రష్యాకు చెందిన యుజెనియా క్యూడా (Eugenia Kuyda) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూపొందించాడు. తన స్నేహితుడు చనిపోవడంతో.. ఒంటరిగా జీవించడం యుజెనియాకు కష్టంగా అనిపించింది. దీంతో తన స్నేహితుడు పోలికలతో ఒక ఏఐ బాట్ రెప్లికాను రూపొందించాడు. అందులో తన స్నేహితుడికి సంబంధించిన అన్ని వివరాలను ప్రోగ్రామ్ చేశాడు. అలా, రోజూ ఏఐ బాట్‌తో చాట్ చేసేవాడు. అనంతరం, యూజర్లు తమకు నచ్చిన పోలికలతో ఏఐ బాట్‌లను రూపొందించుకునే యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ చాట్‌బాట్‌లు యూజర్లకు సహాయకారులుగా ఉంటాయి. యూజర్ ఎంచుకున్న సేవల ఆధారంగా వారితో చాట్, సంభాషణలు జరుపుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా