5G Network: 5జీ ప్లాన్ల కోసం 45 శాతం అధికంగా చెల్లించడానికైనా సిద్ధమట!

దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న 10 కోట్ల మంది వినియోగదారులు 2023 నాటికి 5జీ నెట్‌వర్క్‌కు మారేందుకు ఆసక్తిగా ఉన్నారని ఎరిక్సన్‌ నివేదిక బుధవారం వెల్లడించింది....

Updated : 28 Sep 2022 21:05 IST

ఎరిక్సన్‌ సర్వేలో వినియోగదారులు

దిల్లీ: దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులు 2023 నాటికి 5జీ నెట్‌వర్క్‌కు మారేందుకు ఆసక్తిగా ఉన్నారని ఎరిక్సన్‌ నివేదిక బుధవారం వెల్లడించింది. అలాగే వీరిలో చాలా మంది 5జీ సేవల కోసం 45 శాతం అధిక ధరలు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపింది. దీంతో టెలికాం కంపెనీలకు మంచి ఆదాయం రానుందని అంచనా వేసింది. 

చాలా మంది 5జీ సేవల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని నివేదిక తెలిపింది. దాదాపు 36 శాతం మంది నాణ్యతను బట్టి నెట్‌వర్క్‌ను ఎంచుకుంటామని తెలిపారు. అలాగే 60 శాతం మంది ప్రస్తుతం ఉన్న యాప్‌ల కంటే మెరుగైన, వినూత్నమైనవి అందుబాటులో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సర్వే నిర్వహించిన ఎరిక్సన్‌ దాదాపు 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల అభిప్రాయాలు సేకరించింది. 

పట్టణ ప్రాంతాల్లో 5జీకి మారేందుకు వినియోగదారులు ఆతృతగా ఉన్నారని సర్వేలో తేలింది. 5జీ నెట్‌వర్క్‌ ఇప్పటికే అందుబాటులో ఉన్న అమెరికా, యూకేతో పోలిస్తే భారత్‌లోనే 5జీకి మారే సంసిద్ధత రెండింతలు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే 5జీ ఫోన్లు కలిగి ఉన్న యూజర్లలో దాదాపు సగానికి పైగా మంది వచ్చే 12 నెలల్లో అధిక ధర ప్లాన్లకు మారడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని