Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
Swiggy on Extra charge: ఒక్కో ఆర్డర్‌పై రూ.3 చొప్పున స్విగ్గీ అదనంగా వసూలు చేస్తోందంటూ సోషల్‌మీడియాలో రెండ్రోజులుగా పోస్టులు వెల్లువెత్తున్నాయి. దీనిపై స్విగ్గీ స్పందించింది.
Swiggy extra charge | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) వార్తలకెక్కింది. ఆర్డర్ సమయంలో చిల్లర కొట్టేస్తోందంటూ పలువురు యూజర్లు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. బిల్లు మొత్తం రౌండాఫ్ పేరిట దాదాపు రూ.3 వరకు అదనంగా వసూలు చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై స్విగ్గీ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే అలా చూపుతోందంటూ వివరణ ఇచ్చింది.
@kingslyj అనే యూజర్ ఎక్స్‌లో (ట్విటర్) స్విగ్గీ మోసం అని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఒకప్పుడు స్విగ్గీ రౌండాఫ్ పేరిట పైసల్లో తీసుకునేదని, ఇప్పుడు ఒక్కో బిల్లుపై రూ.3 చొప్పున అదనంగా వసూలు చేస్తోందని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌కు వాస్తవంగా రూ.671.91 కాగా (626.57+35.24+2.00+28.00-52.99+33.09 = 671.91) తన వద్ద రౌండాఫ్ పేరిట 9 పైసలతో పాటు అదనంగా మరో రూ.3 స్విగ్గీ తీసుకుందని తెలిపాడు. కస్టమర్లకు ఎలాంటి సర్వీసూ ఇవ్వకుండానే ఏటా కోట్లాది రూపాయలు ఇలా స్విగ్గీ దోచుకుంటోందని ఆరోపించాడు.
ఫ్లెక్సీ క్యాప్.. మల్టీ క్యాప్.. పెట్టుబడి ఏ విభాగంలో?
ఇదే ట్వీట్‌పై క్యాపిటల్ మైండ్ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపక్ సెనోయ్ సైతం స్పందించారు. స్విగ్గీ వేదికగా తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తాను రూ.255.60 విలువైన ఫుడ్ ఆర్డర్ చేయగా.. తనకు రూ.259 స్విగ్గీ ఛార్జీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.5గా పేర్కొని డిస్కౌంట్ పేరిట మళ్లీ రూ.2గా చూపించి.. వాస్తవంలో మళ్లీ ఆ మూడు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ తన స్వీయ అనుభవాన్ని వివరించారు. బహుశా ఇది డిస్ప్లే ఎర్రర్ కావొచ్చనీ అభిప్రాయపడ్డారు. ఈ పోస్టులపై కొందరు తమకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై స్విగ్గీ స్పందించింది. ‘‘ఆర్డర్ హిస్టరీ పేజీలో కొందరికి డిస్కౌంట్ అమౌంట్ తక్కువగా చూపిస్తోంది. వాస్తవానికి కస్టమర్లు వాస్తవ మొత్తాన్నే చెల్లించారు. టెక్నికల్ బగ్ కారణంగా ఆర్డర్ హిస్టరీ పేజీలో మాత్రమే ఇలా చూపిస్తోంది. మా టెక్నికల్ టీమ్ ఈ బగ్‌ను సరిచేసింది. ఇకపై మీకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు’’ అని స్విగ్గీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
Nicolas Puech: వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకున్న సంరక్షకుడిని.. రూ.వేల కోట్ల ఆస్తి (Fortune)కి వారసుడిని చేస్తున్నారో బిలియనీర్. రూ.97వేల కోట్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు. -
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
Edelweiss CEO Radhika Gupta Zomato, Swiggy: మ్యుచువల్ ఫండ్స్ సంస్థ ఎడిల్విస్ సీఈఓ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటోతోనే పోటీ అని అన్నారు. -
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
Sovereign Gold Bond: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2 విడతల్లో సార్వభౌమ పసిడి బాండ్ల ప్రభుత్వం జారీ చేయనుంది. బాండ్ల జారీ చేసే తేదీలను వెల్లడించింది. -
Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి
Narayana Murthy: వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సమర్థించుకున్నారు. తాను 40 ఏళ్ల పాటు అలాగే పనిచేశానని తెలిపారు. -
వృద్ధిరేటు అంచనా 7 %
వరుసగా అయిదో ద్వైమాసిక సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. -
చక్కెర మిల్లులపై అంబానీ దృష్టి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా చక్కెర మిల్లులపై దృష్టి సారించిందని వార్తలొస్తున్నాయి. -
షేర్లు కొన్న రోజే సెటిల్మెంట్!
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్మెంట్ చేసే ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్ తెలిపారు. -
నిఫ్టీ @ 21,000
గురువారం నాటి నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, శుక్రవారం సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 70,000 పాయింట్లకు చేరువ కాగా.. నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి ఇంట్రాడేలో 21,000 పాయింట్లను అధిగమించింది. -
ఈక్విటీ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి గత నెలలో నికరంగా రూ.15,536 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) వెల్లడించింది. -
పర్యావరణం, సమాజానికి చేయూత అందించాలి
పర్యావరణానికి మేలు చేసేలా, సమాజాభివృద్ధికి ఉపకరించే సానుకూల దృక్పథంతో కంపెనీలు వ్యవహరించాలని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. -
వరద ప్రభావిత వినియోగదార్లకు అత్యవసర సేవాకేంద్రం: ఎస్బీఐ జనరల్
తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న తమిళనాడు వినియోగదార్లకు సేవలు అందించేందుకు అత్యవసర సేవా కేంద్రాన్ని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. -
ఐఫోన్ కొత్త ప్లాంట్‌కు టాటాల సన్నాహాలు
దేశంలో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. -
ఓటీటీ ఆదాయాల్లో ఏటా 25% వృద్ధి
భారత్‌లో ఓటీటీ (ఓవర్-ద-టాప్) వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
మన దేశానికి స్వాతంత్య్రం లభించి శతాబ్ది కాలం పూర్తయ్యే 2047కు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోహ్రి శుక్రవారం వెల్లడించారు. -
YouTube: యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
YouTube: కంటెంట్ క్రియేటర్లకు వారి కామెంట్ సెక్షన్‌పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. -
boAt smartwatch: జియో e-సిమ్‌తో బోట్ తొలి స్మార్ట్‌వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్‌తో బోట్ తొలి స్మార్ట్‌వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్‌ఫోన్ అక్కర్లేదు.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: రాహుల్ ద్రవిడ్ చెప్పిందే ఫాలో అవుతున్నా: రింకు సింగ్
-
Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
-
Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా
-
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి