Ads: ప్రకటనలపై అభ్యంతరాలా? దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు!

సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనవసర, పక్కదారి పట్టించే ప్రకటనలపై వినియోగదారులు చట్టబద్ధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సూచించారు....

Updated : 18 Aug 2022 15:49 IST

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనవసర, పక్కదారి పట్టించే ప్రకటనలపై వినియోగదారులు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐటీ నిబంధనల ప్రకారం.. ప్రకటనలపై వచ్చే ఫిర్యాదులను సోషల్‌ మీడియా వంటి మధ్యవర్తిత్వ సంస్థలు పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నోటీసులు, అధీకృత ఏజెన్సీల ద్వారా వచ్చే ఆదేశాల మేరకు అనుచిత కంటెంట్‌ను వెంటనే సామాజిక మాధ్య సంస్థలు తొలగించాల్సి ఉంటుందని  తెలిపారు. డిజిటల్‌ మీడియా సహా ఇతర ఏ వేదికలపైనైనా అనవసర ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు ‘వినియోగదారుల వ్యవహారాల విభాగం’ ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని