Travel Insurance: విదేశీ ప్రయాణ బీమాతో ఉపయోగాలు
అంతర్జాతీయ పర్యటనకు ప్లాన్ చేస్తుంటే..ప్రయాణ బీమా తీసుకోవడం చాలా మంచిది. సమగ్ర పాలసీతో పాటు అనేక యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు, ఈ ప్రయాణ బీమా వివరాలు ఇక్కడ చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ ముందు కంటే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలు బాగా పెరిగాయని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రయాణాలలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వివిధ సంఘటనల కారణంగా అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఏర్పడొచ్చు. విదేశీ పర్యటనలో కూడా ఇలాంటివి జరిగే అవకాశం లేకపోలేదు. పర్యటన సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే (ప్రత్యేకించి దూర ప్రాంతంలో) అది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. కాబట్టి, విదేశీ పర్యటనలు చేసేవారు తగిన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, విదేశీ ప్రయాణానికి తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
బీమా తప్పనిసరి
విదేశాలకు వెళ్లేటప్పుడు పర్యాటకులు వారి ముఖ్యమైన జాబితాలో తప్పనిసరిగా ప్రయాణ బీమాను కలిగి ఉండాలి. పర్యటన, వారాలు/నెలల వరకు కొనసాగితే ప్రయాణ వ్యవధిలో యాక్టివ్‌గా ఉండే పాలసీని తీసుకోండి. మొత్తం ట్రిప్‌ను కవర్ చేసే బీమాను కొనుగోలు చేయాలి. తద్వారా అత్యవసర సమయంలో బీమా అనేది ఒక సహాయక వ్యవస్థలా పనిచేస్తుంది. ప్రయాణ బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి.
మెడికల్ ఎమర్జెన్సీ కవరేజ్
ట్రావెల్ ఇన్సూరెన్స్, పాలసీదారుడిని అత్యవసర పరిస్థితుల్లో వైద్య పరమైన ఖర్చుల నుంచి కాపాడుతుంది. ఇది ఆసుపత్రి బిల్లులు, అంబులెన్స్ ఛార్జీలు మొదలైన ఖర్చులను కవర్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల కారణంగా పాలసీదారుడికి వైకల్యం లేదా మరణం సంభవించిన సందర్భాల్లో వైద్య ఖర్చుల కోసం లబ్ధిదారులు క్లెయిం చేయొచ్చు.
ట్రిప్ క్యాన్సిలేషన్ కవరేజ్
ఈ రోజుల్లో ప్రయాణికులు తమ విమాన టికెట్లు, హోటళ్లు మొదలైన వాటిని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. కానీ, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంతంలో ఏవైనా రాజకీయ అశాంతి కారణంగా మీ ప్రయాణ ట్రిప్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తే ఈ ప్రయాణ బీమా రక్షణను అందిస్తుంది. కొన్ని బీమా పథకాలు అటువంటి సందర్భాల్లో ప్రయాణ ఖర్చులను కూడా వాపసు ఇస్తాయి.
ట్రిప్ జాప్యాలు, అంతరాయాలు
ప్రయాణంలో మీ విమానం ఆలస్యమైతే లేదా వాతావరణం అనుకూలించని కారణంగా విమానం రద్దు లాంటి ఊహించని అంతరాయాలు ఏర్పడితే, దీనివల్ల జరిగే నష్టాలకుగాను మీరు చేసిన ఖర్చులను రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
లగేజ్ కోల్పోవడం
ప్రయాణంలో, ప్రత్యేకించి విదేశీ ప్రదేశానికి వెళ్లేటప్పుడు లగేజీ కోల్పోయే అవకాశం ఉంది. పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న పరిమితుల్లో మీ చెక్-ఇన్ బ్యాగేజీ, దాని కంటెంట్‌లను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును ప్రయాణ బీమా పాలసీ రీయింబర్స్ చేస్తుంది.
ఎమర్జెన్సీ ట్రిప్ ఎక్స్‌టెన్షన్స్
మెడికల్ ఎమర్జెన్సీ, ప్రకృతి వైపరీత్యాలు లేదా రాజకీయ అశాంతి వంటి కారణాల వల్ల ప్రయాణికుడు విదేశంలో అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాల్లో, వేరే విమానాలకు మారడం లేదా రీషెడ్యూల్ చేయడం, హోటల్‌లను బుక్ చేసుకోవడం లాంటి అదనపు ఖర్చులు తప్పవు. ఈ ఖర్చులను కవర్ చేయడానికి ప్రయాణికుడు ఎమర్జెన్సీ ట్రిప్ ఎక్సెటెన్షన్ కవర్‌ను ఉపయోగించుకోవచ్చు. అదనపు బీమా బీమా రక్షణ కోసం చూస్తున్న ప్రయాణికులు బీమా పాలసీతో పాటు కొన్ని యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు, అవేంటో చూడండి.
ఫ్రాడెంట్ కవరేజ్ ఛార్జీలు
ప్రయాణికుడు నోటిఫైడ్ పేమెంట్ కార్డును పోగొట్టుకున్నప్పుడు లేదా అది చోరీకి గురయినప్పుడు, అనధికార ఛార్జీల కోసం రీయింబర్స్‌మెంట్ పొందడానికి ప్రయాణికుడికి ఈ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది.
రిఫండ్ ఆఫ్ వీసా ఫీ రిజక్షన్
ప్రయాణికుడి వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైతే వీసా రుసుం వాపసుకు సంబంధించిన ఐచ్ఛిక యాడ్-ఆన్ ప్రయోజనాన్ని కొన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి.
అడ్వెంచర్ స్పోర్ట్స్ కవరేజ్
ఒక వ్యక్తి అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొంటునప్పుడు అనారోగ్యం, గాయం లేదా మరణానికి సంబంధించిన కవరేజీని విడిగా ఎంచుకోవచ్చు. ఇది బీమా సంస్థ పేర్కొన్న రీయింబర్స్‌మెంట్ ఆధారంగా పనిచేస్తుంది.
బండిల్డ్ Vs స్టాండలోన్ పాలసీ
సాధాణంగా చాలా ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్‌లు బండిల్డ్ కవరేజ్ పాలసీనందిస్తాయి. ఇది చౌకైనది కూడా. ఈ పాలసీ ప్రయాణికులందరికీ ఒకేరకమైన సాధారణ బీమా ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్లేటప్పుడు ఎక్కువ రక్షణ పొందడానికి బండిల్డ్ పాలసీ తీసుకోవడమే మేలు. మీరు ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ తిరుగుబాట్లు లేదా ఆరోగ్య సమస్యలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాలను సందర్శిస్తున్నట్లయితే ఈ పాలసీ ప్రమాదాలకు సరిపోయే సమగ్ర రక్షణను అందిస్తుంది. ఇందులో ప్రయాణ రద్దు/అంతరాయం వల్ల ఏర్పడే ఖర్చులు, అత్యవసర వైద్య ఖర్చులను కూడా కలిగి ఉండొచ్చు. ఇది లొకేషన్‌లో జరిగే ప్రమాదాలను బట్టి ఉంటుంది. మీరు సుదీర్ఘ ప్రయాణం లేదా అనేక దేశాలను సందర్శిస్తున్నట్లయితే స్టాండలోన్ ప్రయాణ బీమా మొత్తం ప్రయాణానికి కవరేజీని అందిస్తుంది.
చివరిగా: వాహనం, జీవితం, వైద్య అవసరాలకు ఎలా బీమా తీసుకుంటామో విదేశీ ప్రయాణాలకు ప్లాన్ చేసినప్పుడు.. సమగ్ర ప్రయాణ బీమా పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్