Vedanta Group: సంపద సృష్టిలో వేదాంతా గ్రూప్‌ మిన్న

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మదుపర్లకు అత్యంత ఎక్కువ లాభాలు ఇచ్చిన సంస్థల్లో వేదాంతా గ్రూప్‌ అగ్రస్థానంలో నిలిచింది.

Published : 21 Jun 2024 03:10 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మదుపర్లకు అత్యంత ఎక్కువ లాభాలు ఇచ్చిన సంస్థల్లో వేదాంతా గ్రూప్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 28 నుంచి జూన్‌ 20 మధ్య వేదాంతా గ్రూప్‌ సంస్థలు వేదాంతా, హిందుస్థాన్‌ జింక్‌ల మార్కెట్‌ విలువ రూ.2.2 లక్షల కోట్లు వృద్ధి చెందింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూప్, టాటా గ్రూప్‌ కంపెనీల కంటే ఇది అధికం. సానుకూల ఆర్థిక ఫలితాలు, కంపెనీల విభజన, ఇతర వనరులపై స్థిరమైన దృష్టి వంటివి వేదాంతా గ్రూప్‌ దూకుడుకు దోహదపడ్డాయి. వేదాంతా తర్వాత మార్కెట్‌ విలువ ఎక్కువగా పెంచుకున్న వాటిలో అదానీ గ్రూప్‌ (రూ.1.4 లక్షల కోట్లు), మహీంద్రా గ్రూప్‌ (రూ.1.4 లక్షల కోట్లు), టాటా గ్రూప్‌ (రూ.60,600 కోట్లు) ఉన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.20,656.14 కోట్లు తగ్గింది. మే 22న వేదాంతా షేరు రూ.506.85 వద్ద, హిందుస్థాన్‌ జింక్‌ రూ.807 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. గురువారం వేదాంతా షేరు రూ.470.25; హిందుస్థాన్‌ జింక్‌ షేరు రూ.647.65 వద్ద ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని