Virushka: కొన్నిసార్లు మాంసం రుచిని మిస్‌ అవుతుంటాం..!

పవర్‌ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క జంట మొక్కల ఆధారిత మాంసం పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనే స్టార్టప్‌లో వీరు పెట్టుబడి పెట్టారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఓ ప్రమోషనల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. దానిలో వీరిద్దరు జంటగా కనిపించారు. 

Published : 09 Feb 2022 01:55 IST

మొక్కల ఆధారిత మాంసం తయారీ సంస్థలో విరాట్ జంట పెట్టుబడులు

ముంబయి: పవర్‌ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క జంట మొక్కల ఆధారిత మాంసం తయారీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనే స్టార్టప్‌లో వీరు పెట్టుబడి పెట్టారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఓ ప్రమోషనల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.

‘ఈ గ్రహాన్ని భవిష్యత్తుతరాలకు మంచి ప్రదేశంగా ఎలా మార్చగలం అనే దానిపై నేను, విరాట్ తరచూ మాట్లాడుకుంటుంటాం. అందుకోసం మా జీవితాల్లో మేం మార్చుకున్న అంశాలలో ఒకటి.. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం. అంటే మాంసాన్ని అస్సలు తీసుకోకుండా ఉండటం. అయితే ఆహార ప్రియులుగా ఒక్కోసారి మేం మాంసం రుచిని మిస్‌ అవుతున్నాం’ అంటూ ఇద్దరూ తమ డైట్ గురించి వివరించారు.

బ్లూ ట్రైబ్‌ ఫుడ్స్ అనే స్టార్టప్‌కు ముంబయి కేంద్ర కార్యాలయం. దానిని సందీప్‌ సింగ్‌, నిక్కీ అరోరా సింగ్ స్థాపించారు. మరోపక్క బాలీవుడ్ జంట రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా.. ఇమాజిన్ మీట్స్ పేరుతో ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. ఇమాజిన్ మీట్స్ మొక్కల ఆధారిత మాంసాన్ని తొమ్మిది రకాల్లో అందిస్తోంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 30 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆ జంట లక్ష్యంగా పెట్టుకుంది. జంతువుల పెంపకంతో ముడిపడి ఉన్న కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ మాంసం కానీ మాంసానికి డిమాండ్‌ పెరుగుతోంది. భారత్‌ మార్కెట్‌లో ఈ రంగం క్రమంగా పంజుకుంటోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని