Vivo X90: ఎక్స్‌90 సిరీస్‌తో ప్రీమియం సెగ్మెంట్‌లో పటిష్ఠ స్థానం: వివో

Vivo X90: ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌90 సిరీస్‌ పేరిట వివో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. వీటితో ప్రీమియం విభాగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Published : 23 Apr 2023 23:40 IST

దిల్లీ: త్వరలో విడుదల చేయనున్న ఎక్స్‌90 (Vivo X90) సిరీస్‌ మొబైళ్లతో ప్రీమియం సెగ్మెంట్‌లో తమ స్థానం పటిష్ఠమవుతుందని వివో ధీమా వ్యక్తం చేసింది. అలాగే ఈ మొబైళ్లను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లుగా తెలిపింది. ఏప్రిల్‌ 26న వివో ఎక్స్‌90, ఎక్స్‌90 ప్రో మోడల్‌ మొబైళ్లను భారత్‌లో విడుదల కానున్నాయి.

ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఎక్స్‌90 (Vivo X90) సిరీస్‌ మొబైళ్లు అత్యున్నత నాణ్యతను అందిస్తాయని వివో తెలిపింది. గ్రేటర్‌ నోయిడాలో ఉన్న తయారీ కేంద్రంలో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. 2023 ముగిసే నాటికి భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు మరో రూ.1,100 కోట్లు వెచ్చిస్తామని వివో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే నోయిడాలో నిర్మాణ దశలో ఉన్న కొత్త ప్లాంట్‌లో 2024 ఆరంభానికి తయారీ ప్రారంభమవుతుందని ప్రకటించింది.

ఎక్స్‌90 (Vivo X90) సిరీస్‌ మొబైళ్ల విక్రయాల విషయంలో తాము ఎలాంటి లక్ష్యం నిర్దేశించుకోవడం లేదని వివో తెలిపింది. అయితే, రూ.30 వేలు ఆపైన ధర ఉన్న సెగ్మెంట్‌లో ప్రస్తుతం తమ వాటా 13 శాతం ఉందని.. దాన్ని మరింత పైకి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు వివో బ్రాండ్‌ స్ట్రాటజీ విభాగాధిపతి యోగేంద్ర శ్రీరాముల తెలిపారు. ఎక్స్‌ సిరీస్‌ ప్రీమియం ఫోన్లను వివో 2020లో విడుదల చేసింది. ఆ ఏడాది ముగిసే నాటికి ప్రీమియం విభాగంలో వివో వాటా 3.3 శాతంగా నమోదైంది. అది ఇప్పుడు 13 శాతానికి చేరింది.

ఎక్స్‌90 సిరీస్‌లో విడుదల చేయనున్న రెండు ఫోన్లలో లేటెస్ట్‌ జనరేషన్‌కు చెందిన వివో-ZEISS కో-ఇంజినీర్డ్‌ ఇమేజింగ్‌ సిస్టమ్స్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ప్రో ఇమేజింగ్‌ చిప్‌ వీ2తో కూడిన మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌ ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని