Vivo V29 Pro: 50MP సెల్ఫీ కెమెరాతో వివో వీ29 ప్రో
Vivo V29 Pro: వివో త్వరలో వీ29 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. వీ29 ప్రో మోడల్ స్పెసిఫికేషన్లను తాజాగా కంపెనీ తన వెబ్‌సైట్‌లో బహిర్గతం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వీ29 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు వివో (Vivo V29 Series) సిద్ధమవుతోంది. అందులో భాగంగా వీ29 ప్రో (V29 Pro) జూన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కొన్ని కీలక స్పెసిఫికేషన్లను వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
వివో వీ29 ప్రో (Vivo V29 Pro) స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రెజల్యూషన్ (2400 x 1080 pixels) కర్వ్‌డ్ ఓలెడ్ డిప్‌ప్లేను ఇస్తున్నారు. దీని రీఫ్రెష్ రేట్ 120Hzగా ఉంది. 12GB ర్యామ్, 256 స్టోరేజ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. అయితే, ఇదొక్కటే స్టోరేజ్ వేరియంట్‌తో వివో ఈ ఫోన్ (Vivo V29 Pro)ను విడుదల చేస్తుందా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వెనుక భాగంలో 64 ఎమ్‌పీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన కెమెరా ఉన్నట్లు తెలిపింది. సెల్ఫీ కెమెరాలో సైతం 50ఎమ్‌పీ ప్రైమరీ సెన్సార్ ఉన్నట్లు పేర్కొంది. 66వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నట్లు తెలిపింది.
ఈ ఏడాది మార్చిలో వివో.. వీ27, వీ27 ప్రో మోడళ్లను ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లతో తీసుకొచ్చింది. వీటిలో 66 వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’