Vodafone Idea: వొడాఫోన్ లాంగ్‌ప్లాన్.. ₹2999 రీఛార్జితో 850 జీబీ డేటా!
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఏడాది వ్యాలిడిటీలో కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్లు పరిశీలించొచ్చు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Prepaid plans) తీసుకొచ్చింది. రూ.2899, రూ.2999, రూ.3099 ధరల్లో మూడు వార్షిక ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు. రూ.3,099 ప్లాన్‌లో ఓటీటీ సబ్స్క్రిప్షన్ అందిస్తుండగా.. మిగిలిన రెండు ప్లాన్లలో రాత్రిపూట అపరిమిత డేటా వినియోగించుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ల కోసం చూస్తున్న వారు వీటిని పరిశీలించొచ్చు.
- రూ.2999 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. మొత్తంగా 850 జీబీ డేటా లభిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక్క రూపాయి చెల్లించకుండానే అపరిమిత డేటాను వాడుకోవచ్చు.
- ఇక రూ.2899 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా ఇస్తున్నారు. 365 వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా వాడుకోవచ్చు.
- 3,099 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ కూడా ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. మరోవైపు వినియోగదారులను పెంచుకోవడానికి వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. పోస్ట్‌పెయిడ్ విభాగంలో కొన్ని ప్లాన్ల ధరలను తగ్గించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Joe Biden: మా జోలికొస్తే ఏం చేస్తామో చూపించాం.. చైనాకు బైడెన్ గట్టి వార్నింగ్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Movies News
Rashmika: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది : రష్మిక
-
Politics News
Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
-
World News
Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు