Vodafone Idea: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్‌

Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు.

Published : 16 Jun 2024 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (VIL) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (Vodafone Idea Prepaid Plan) తీసుకొచ్చింది. దీని ధర రూ.248. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో ఇది అందుబాటులో ఉంది. అయితే, ఇది సాధారణ సర్వీస్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ కాదు. ఇది ఒక డేటా వోచర్‌. దీన్ని రీఛార్జ్‌ చేసుకోవాలంటే కచ్చితంగా యాక్టివ్‌ సర్వీస్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ ఉండాల్సిందే. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఓటీటీ ప్రయోజనాలు లభించడం విశేషం.

వొడాఫోన్‌ ఐడియా రూ.248 ప్లాన్‌ (Vodafone Idea Prepaid Plan) వ్యాలిడిటీ ఒక నెల. దీంట్లో 6జీబీ డేటా లభిస్తుంది. వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ (ఎంటీవీ) ప్రో సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంటుంది. సాధారణంగా వీఐ ఎంటీవీ ప్రో సభ్యత్వం విడిగా తీసుకుంటే నెలకు రూ.202 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, ఫ్యాన్‌కోడ్‌, క్లిక్‌, మనోరమా మ్యాక్స్‌, చౌపల్‌, హంగామా సహా పలు ఓటీటీలు లభిస్తాయి. టీవీ సహా మొబైల్‌లోనూ వీటి కంటెంట్‌ను వీక్షించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని