Vodafone Idea: ఎయిర్‌టెల్‌ బాటలో వొడాఫోన్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ వ్యాలిడిటీలో కోత!

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (VI) సైతం తన ప్రీపెయిడ్‌ ప్లాన్లను సవరించింది. ఆయా ప్లాన్లలో భాగంగా అందిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon prime) వ్యాలిడిటీని ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది.

Published : 29 Apr 2022 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (VI) సైతం తన ప్రీపెయిడ్‌ ప్లాన్లను సవరించింది. ఆయా ప్లాన్లలో భాగంగా అందిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon prime) వ్యాలిడిటీని ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. మరో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ఇది వరకే ఈ ప్లాన్లను సవరించించింది. ప్రస్తుతం రూ.499, రూ.699 వ్యక్తిగత ప్లాన్లతో పాటు, రూ.999 నుంచి ప్రారంభమయ్యే ఫ్యామిలీ ప్లాన్లపై వొడాఫోన్‌ ఐడియా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ తన ఏడాది ప్లాన్‌ రూ.999 నుంచి రూ.1499కు పెంచడంతో  టెలికాం సంస్థలు ఆ మేరకు కోత విధిస్తున్నాయి. సవరించిన ప్లాన్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు వొడాఫోన్‌ పేర్కొంది. అయితే, జియో మాత్రమే ప్రస్తుతం తన పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లపై ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అయితే, త్వరలో జియో సైతం సబ్‌స్క్రిప్షన్‌లో కోత విధించే అవకాశం ఉందని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని