Vodafone Idea: ₹82కే కేబీసీ 2022 వీక్షించొచ్చు..వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేక ఆఫర్‌!

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరించే ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రాం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి (KBC)’ ఫ్యాన్స్‌కు వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది....

Published : 10 Aug 2022 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరించే ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రాం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి (KBC)’ ఫ్యాన్స్‌ కోసం వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంను నేరుగా మొబైల్‌లో వీక్షించేందుకు వీలుగా రూ.82 స్పెషల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను తీసుకున్నవారికి 28 రోజుల వ్యాలిడిటీతో సోనీలివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఈ ప్లాన్‌ కేవలం డేటా వోచర్‌ మాత్రమే. అంటే ఈ ప్లాన్‌ యాక్టివ్‌లో ఉండాలంటే కచ్చితంగా ఒక బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే. పైగా సోనీలివ్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే వస్తుంది. అదనంగా 14 రోజుల కాలపరిమితితో 4జీబీ డేటా కూడా లభిస్తుంది. సోనీలివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రం 28 రోజుల పాటు ఉంటుంది. కేబీసీ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినప్పటికీ.. ప్లాన్‌ గడువు ముగిసే వరకు సోనీలివ్‌ కంటెంట్‌ మొత్తం వీక్షించొచ్చు.

ఒకవేళ సోనీలివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రత్యేకంగా తీసుకోవాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. అదే మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే కావాలనుకుంటే.. రూ.599 చెల్లించాలి. ప్రత్యేకంగా కేబీసీ మాత్రమే వీక్షించాలనుకునే వారికి వొడాఫోన్‌ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్‌ అనువుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని