Prepaid Plan: ₹839 ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. ఎయిర్‌టెల్‌ Vs వొడాఫోన్‌ ఐడియా ఏది బెటర్‌?

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.839 ప్లాన్‌లలో ఏది బెటరో ఓసారి చూద్దాం..

Updated : 28 May 2022 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ వినియోగదారులకు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ విస్తృత ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇరు సంస్థలూ రూ.839 ప్లాన్‌ను అందుబాటులో ఉంచాయి. వీటి ప్రయోజనాలు కూడా దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. మరి రెండింట్లో ఏది బెటరో ఓసారి చూద్దాం..

భారతీ ఎయిర్‌టెల్‌ ప్రయోజనాలు..

రూ.839 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో ఎయిర్‌టెల్‌ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. రోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. అంటే మొత్తం ఈ ప్లాన్‌లో 168 జీబీ డేటా వస్తోంది. మరిన్ని అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. మూడు నెలలకు డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఎక్స్‌ట్రీం మొబైల్‌ ప్యాక్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను ఒకనెల పాటు ఎంజాయ్‌ చేయొచ్చు. అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌, ఉచిత వింక్‌ మ్యూజిక్‌ను కూడా పొందొచ్చు. 2జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

వొడాఫోన్‌ ఐడియా ప్రయోజనాలు..

వొడాఫోన్‌ ఐడియా అందిస్తున్న రూ.839 ప్లాన్‌లోనూ రోజూ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది. అదనపు ప్రయోజనాల్లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను ఎంజాయ్‌ చేయొచ్చు. అలాగే వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌, డేటా డిలైట్‌ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 2 జీబీ డేటా వినియోగం తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

రెండు ప్లాన్లను పరిశీలిస్తే.. సాధారణ ప్రయోజనాలు ఒకేరకంగా ఉన్నాయి. కానీ, అదనపు ప్రయోజనాలు మాత్రం రెండింట్లో కాస్త భిన్నంగా ఉన్నాయి. అయితే, రెండింట్లో ఏది ఉత్తమమనే విషయం మాత్రం పూర్తిగా యూజర్ల అవసరాలపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని