Vodafone Layoffs: వొడాఫోన్‌లోనూ ఉద్యోగుల తొలగింపు.. 11 వేల మందికి ఉద్వాసన

Vodafone Layoffs: వచ్చే మూడేళ్లలో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాలని వొడాఫోన్‌ నిర్ణయించింది. ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదని.. ఈ నేపథ్యంలోనే తొలగింపులు తప్పడం లేదని పేర్కొంది.

Updated : 16 May 2023 17:59 IST

లండన్‌: టెక్‌ కంపెనీల తరహాలోనే టెలికాం రంగం సైతం ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. తాజాగా బ్రిటన్‌కు చెందిన టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు (Vodafone Layoffs) మంగళవారం ప్రకటించింది.

వచ్చే మూడేళ్లలో దాదాపు 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వొడాఫోన్‌ (Vodafone Layoffs) తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చునని కంపెనీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను తగ్గించుకోవడంలో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు కొత్త సీఈఓ మార్గెరిట డెల వాలె వెల్లడించారు.
Also Read: భారత్‌లో 500 మందికి అమెజాన్‌ ఉద్వాసన!

కంపెనీ ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మార్గెరిట తెలిపారు. ఈ నేపథ్యంలో స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం వొడాఫోన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను నాణ్యమైన సేవలను అందించేందకు అనుగుణంగా కేటాయిస్తామని పేర్కొన్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో తమ పెట్టుబడులను సైతం పునర్‌వ్యవస్థీకరిస్తామని వొడాఫోన్‌ తెలిపింది. అలాగే ఉద్యోగుల తొలగింపు, జర్మనీలో వ్యాపారం పునరుద్ధరించడం, బ్రిటన్‌ సహా ఇతర దేశాల్లో వ్యాపారాన్ని సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు