వోల్వో ఇండియా ఎండీగా జ్యోతి మల్హోత్రా

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో.. ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలను కొత్త సారథికి అప్పగించింది. వోల్వో కార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ)గా

Published : 13 Feb 2021 20:33 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో.. ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలను కొత్త సారథికి అప్పగించింది. వోల్వో కార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ)గా జ్యోతి మల్హోత్రాను నియమించింది. మార్చి 1, 2021 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆగస్టు 2016లో సంస్థలో చేరిన మల్హోత్రా ప్రస్తుతం సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఫియట్‌ ఇండియా వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వాహనరంగంలో ఆయనకు 24 సంవత్సరాల అనుభవం ఉంది. సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్న తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న ఛార్లెస్‌ ఫ్రంప్‌.. సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల్లో భాగం కానున్నారు. స్వీడన్‌కు చెందిన వోల్వో.. ఫ్రంప్‌ హయాంలోనే భారత్‌లో స్థానికంగా ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

ఇవీ చదవండి...

పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా..అయితే,

మీ పిల్లలకు నేర్పుతున్నారా ఈ పాఠాలు..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని