Wakefit: టెంపరేచర్‌ కంట్రోల్‌ ఫీచర్‌తో పరుపులు.. ఆవిష్కరించిన వేక్‌ఫిట్‌

వేక్‌ఫిట్‌ సంస్థ టెంపరేచర్‌ కంట్రోల్‌ సదుపాయంతో కొత్త తరహా పరుపులను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది.

Published : 14 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వేక్‌ఫిట్‌ సంస్థ కొత్తతరహా పరుపులను ఆవిష్కరించింది. టెంపరేచర్‌ను కంట్రోల్‌ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను వినియోగించింది. దీంతోపాటు ఏఐతో పనిచేసే ఓ స్లీప్ ట్రాకింగ్‌ షీట్‌ను కూడా తీసుకొచ్చింది. వినియోగదారులకు సౌకర్యవంతమైన నిద్ర అందించాలన్న ఉద్దేశంతో ఏఐని వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వేక్‌ఫిట్ తెలిపింది. ఈ రెండు ఉత్పత్తుల ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

రెగుల్‌8 అనేది వేక్‌ఫిట్‌ అందిస్తున్న పరుపు. దీని ధర రూ.44,999 నుంచి ప్రారంభం అవుతుంది. కింగ్, క్వీన్‌ సైజుల్లో లభ్యమవుతుంది. రూ.499 చెల్లించి వెబ్‌సైట్‌ ద్వారా ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ పరుపులో టెంపరేచర్‌ సెన్సర్లు ఉంటాయి. పరుపు ఇరువైపులా ఎంతెంత ఉష్ణోగ్రత ఉండాలో మనం ఎంచుకోవచ్చు. 15 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతను సెట్‌ చేసుకోవచ్చు. 1.5 టన్‌ ఏసీతో పోలిస్తే 60 శాతం తక్కువ ఎనర్జీని రెగుల్‌ 8 మ్యాట్రెస్‌ వినియోగించుకుంటుందని వేక్‌ఫిట్‌ తెలిపింది.

ట్రాక్‌ 8 పేరుతో ఓ షీట్‌ను వేక్‌ఫిట్‌ అందిస్తుంది. దీన్ని పరుపు మీద ఉంచినప్పుడు దాని మీద పడుకున్న వ్యక్తుల డేటాను ఇది ప్రాసెస్‌ చేస్తుంది. తద్వారా ఎన్ని గంటలకు పడుకున్నారు.. ఎన్ని గంటలకు లేచారు.. మొత్తంగా ఎన్ని గంటలకు నిద్ర లేచారు.. ఊపిరి వేగం, కదలికలు, గురకల వివరాలను సైతం యాప్‌లో నమోదు చేస్తుంది. ఒకేసారి ఇద్దరు వ్యక్తుల వివరాలను ఇది తెలియజేయగలదు. దీని ధరను రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంది. ఒకవేళ పరుపు, ట్రాకర్‌ రెండూ కావాలంటే రూ.899 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని