రూ.50 ల‌క్ష‌ల‌కు మించిన ప్రాప‌ర్టీ కొంటున్నారా?

ఒక‌రి కంటే ఎక్కువ కొనుగోలుదారులున్న‌ప్ప‌టికీ రూ.50 ల‌క్ష‌ల‌కు మించిన లావాదేవీల‌కు టీడీఎస్ వ‌ర్తిస్తుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం జూన్ 1, 2013 నుంచి వ్య‌వ‌సాయ భూమి కాకుండా ఇత‌ర స్థ‌లాలు లేదా స్థిరాస్తి ..

Published : 25 Dec 2020 18:56 IST

ఒక‌రి కంటే ఎక్కువ కొనుగోలుదారులున్న‌ప్ప‌టికీ రూ.50 ల‌క్ష‌ల‌కు మించిన లావాదేవీల‌కు టీడీఎస్ వ‌ర్తిస్తుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం జూన్ 1, 2013 నుంచి వ్య‌వ‌సాయ భూమి కాకుండా ఇత‌ర స్థ‌లాలు లేదా స్థిరాస్తి కొనుగోలు చేసిన‌ప్పుడు రూ.50 ల‌క్ష‌లు, అంత‌కుమించి లావాదేవీలు జ‌రిపితే సెక్ష‌న్ 194IA ప్ర‌కారం టీడీఎస్‌ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఆస్తి అమ్మ‌కందారుడికి 1 శాతం టీడీఎస్ ప‌డుతుంది. ఒక‌వేళ అమ్మ‌కందారుడి వ‌ద్ద పాన్ లేక‌పోతే 20 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. కొనుగోలు చేసిన ప్రాప‌ర్టీకి సంబంధించిన డ‌బ్బును చెల్లిస్తున్న స‌మ‌యంలో టీడీఎస్ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఎంత మొత్తం టీడీఎస్ వ‌ర్తిస్తుందో అది ప్ర‌భుత్వానికి డిపాజిట్ చేయాలి. ఆస్తిని కొనుగోలు చేసిన నెల ముగిసిన‌ 7 రోజుల్లోపు టీడీఎస్ డిపాజిట్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ఫారం 26QB ద్వారా ఇది పూర్తి చేయాలి. సెక్ష‌న్ 230ఏ, ప్ర‌కారం టీడీఎస్ వ‌ర్తించేవారు TAN కి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు టీడీఎస్‌తో పాటు అప్పుడు TAN వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌వ‌ల‌సి ఉంటుంది.

సెక్ష‌న్ 194IA ప్ర‌కారం టీడీఎస్‌: సెక్ష‌న్ 194IA (3) సెక్ష‌న్ ప్ర‌కారం, టీడీఎస్ స‌మ‌యంలో TAN త‌ప్ప‌నిస‌రి కాదు. సెక్ష‌న్ 194IA ప్ర‌కారం డ‌బ్బు చెల్లింపు స‌మ‌యంలో టీడీఎస్ డిడ‌క్ట్ అవుతుంది. ముందుస్తుగా చెల్లించినా, వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లింపులు చేస్తే టీడీఎస్ వాయిదా చెల్లింపు స‌మ‌యంలో ప‌డుతుంది. ఒక‌రి కంటే ఎక్కువ‌మంది కొనుగోలుదారులు ఉన్న‌ప్ప‌టికీ రూ.50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఒకేసారి చెల్లిస్తే టీడీఎస్ ప‌డుతుంది. గ‌డువు ముగిసేలోపు టీడీఎస్ ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ‌చేయాలి. బ్యాంక్ రుణం ద్వారా ఆస్తి కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ ఇదే నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. అమ్మ‌కందారుడు స్వ‌యంగా టీడీఎస్ చెల్లించేలా బాధ్య‌త వ‌హించాలి. బ్యాంకు ద్వారా లావాదేవీలు జ‌రిపిన‌ప్పుడు బ్యాంకు టీడీఎస్ వ‌ర్తింప‌జేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని