హౌసింగ్ స్కీం ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?

ఒక సాధారణ వ్యక్తి శాశ్వత నివాసం పొందడానికి, కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్నీ (సీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సరసమైన ధరలకే ఇంటిని పొందవచ్చు. కానీ ఇంటి ఒప్పంద పత్రంలో సంతకం చేసేటప్పుడు ఇంటి కొనుగోలుదారుడు జాగ్రత్త వహించాలి.....

Updated : 02 Jan 2021 14:39 IST

ఒక సాధారణ వ్యక్తి శాశ్వత నివాసం పొందడానికి, కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్నీ (సీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సరసమైన ధరలకే ఇంటిని పొందవచ్చు. కానీ ఇంటి ఒప్పంద పత్రంలో సంతకం చేసేటప్పుడు ఇంటి కొనుగోలుదారుడు జాగ్రత్త వహించాలి. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన అలాగే పొదుపు చేసిన డబ్బును కోల్పోవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇతర పథకాలు ద్వారా ఇంటిని బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తాన్ని ఇవ్వడానికి ముందే తనిఖీ చేయవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఈ పథకం నాలుగు రకాలుగా వర్గీకరించబడింది. వీటిలో ఆర్ధికంగా బలహీన వర్గం (ఈడబ్ల్యూఎస్), దిగువ ఆదాయం వర్గం (ఎల్ఐజీ), మధ్యతరగతి ఆదాయ వర్గం-1 (ఎంఐజి-I), మధ్యతరగతి ఆదాయ వర్గం -2 (ఎంఐజి-II). మొదటి రెండు ఆదాయ వర్గాలకు గరిష్ట రాయితీ రూ. 2,67,000. ఎంఐజి-I కోసం రూ. 2,35,000, అలాగే ఎంఐజి-II కోసం రూ. 2,30,000 రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ రాయితీ కూడా ఆదాయ వర్గాల ప్రకారం భిన్నంగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలకు 6.5 శాతం గరిష్ట రాయితీని అందించగా, ఎంఐజి-I కోసం 4 శాతంను అలాగే ఎంఐజి-II కోసం 3 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది.

ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం ఎంఐజి వర్గాలకు కార్పెట్ ప్రాంత పరిమితిని 33 శాతం పెంచడం ద్వారా సరసమైన గృహాలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఎంఐజి- I వర్గానికి కార్పెట్ ప్రదేశం 120 చదరపు మీటర్ల నుంచి 160 చదరపు మీటర్లకు సవరించారు, అలాగే ఎంఐజి-II వర్గం కోసం 150 చదరపు మీటర్ల నుంచి 200 చదరపు మీటర్లకు సవరించారు. 2017 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది.

నిపుణులు మాత్రం కొత్త గృహ నిర్మాణ పథకాల్లోని లోపాలను ఇంటి కొనుగోలుదారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.

మొదటగా ఇంటి కొనుగుగోలుదారుడు ప్రాజెక్ట్ ను సందర్శించి, ఇంటి కొనుగోలు కోసం విచారణను మొదలుపెట్టినప్పుడు, ఈ పథకం కింద ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు బిల్డరుకి చెప్పకూడదు. ఒకవేళ చెప్పినట్లైతే, బిల్డర్ మీకు ముందుగానే ఎక్కువ ధర చెప్పే అవకాశం ఉంటుంది. అదే ఈ పథకం కింద కాకుండా ఫ్లాట్ కొనాలంటే అప్పుడు అదే ఫ్లాట్ తక్కువ ధరకే వస్తుందని నిపుణుడు తెలిపారు.

రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, బుకింగ్ మొత్తాన్ని చెల్లించే సమయంలో అగ్రీమెంట్ ను పూర్తిగా, స్పష్టంగా చదవాలి లేకపోతే బిల్డర్ మోసం చేసే అవకాశం ఉంది.

మొదటగా కొనుగోలుదారుడు కాపీని పరిశీలించవలసి ఉంటుంది. లేదంటే ఇంటి కొనుగోలుదారుడు 36 నెలల కంటే ఎక్కువ కాలానికి సమానమైన నెలవారీ వాయిదాలను చెల్లించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం, 2016 ప్రకారం, కొనుగోలుదారుడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ బిల్డర్ మాత్రం తన టైం లైన్ నిర్వహణ గురించి తెలుసుకుంటాడని పంకజ్ కపూర్, లీసస్ ఫోరాస్ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం, సరసమైన హౌసింగ్ సెగ్మెంట్ కి స్థూల నాన్ పెర్ఫార్మింగ్ ఆస్తులు 2017 ఆర్ధిక సంవత్సరంలో 3.3 శాతం నుంచి 2018 ఆర్ధిక సంవత్సరంలో 4.1 శాతానికి పెరిగింది. ఈ చిన్నపాటి తేడాకు గల కారణాలు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ.

ఇంకొక సమస్య ఏమిటంటే ఒకవేళ ఈ పథకం ద్వారా ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించిన కొనుగోలుదారుడు ఫ్లాట్ ను రద్దు చేయాలనుకుంటే, వారి నుంచి బిల్డర్లు అధిక క్యాన్సిలేషన్ ఛార్జీల‌ను వసూలు చేస్తారు.

హౌసింగ్, అర్బన్ పావర్టీ ఆల్లేవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2015-18 మధ్య కాలంలో ఈ పథకం ద్వారా 1.65 లక్షల మంది లబ్ధి పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు