మ‌దుప‌ర్ల‌కు న‌ష్టం రాకుండా ఉండాలంటే

మార్కెట్లో వ‌చ్చే వివిధ వార్త‌ల‌కు మ‌దుప‌ర్లు అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెంది నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు.​​​​​​......​

Updated : 22 Dec 2020 15:13 IST

మార్కెట్లో వ‌చ్చే వివిధ వార్త‌ల‌కు మ‌దుప‌ర్లు అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెంది నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు.

​​​​​​​షేర్లలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్లు రాబ‌డి పొందాల‌నుకోవ‌డం స‌హ‌జం. అయితే ఇందులో న‌ష్టం వ‌చ్చేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. కాబ‌ట్టి షేర్లలో పెట్టుబ‌డి చేసేవారు త‌మ న‌ష్టాన్ని త‌గ్గించుకోవ‌డానికి లేదా రాకుండా చూసుకోవ‌డానికి కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.

షేర్ల‌లో పెట్టుబ‌డి చేసేవారు స్వ‌ల్ప‌కాల‌మైన లేదా దీర్ఘ‌కాల‌మైనా ఒక ప‌ధ్ధ‌తి ప్ర‌కారం చేస్తే మంచి లాభాలు పొంద‌వ‌చ్చ‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది మ‌దుప‌ర్లు షేర్ల‌ను కొనిన త‌రువాత వాటికి స్టాప్ లాస్ పెడుతుంటారు. అయితే ఈ స్టాప్ లాస్ వ‌ల్ల న‌ష్టాన్నిత‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ప‌దేప‌దే స్టాప్ లాస్ ట్రిగ్గ‌ర్ అవ్వ‌డం వ‌ల్ల కొంత మొత్తం న‌ష్టం వ‌చ్చిన ఎక్కువ సార్లు ఈ విధంగా జ‌ర‌గితే పెద్ద మొత్తంలో న‌ష్టం వ‌స్తుంది.

స్టాప్ లాస్ పెట్టుకోవ‌ద్ద‌ని చెప్ప‌ట్లేదు కానీ పెట్టే స్టాప్ లాస్ కొంత టెక్నిక్ ఉండాలి. ఎందుకంటే షేరు ఒక్కోసారి ధ‌ర త‌గ్గి త‌రువాత పెర‌గడం ప్రారంభించిదంటే స్టాప్ లాస్ ట్రిగ‌ర్ అయిన వారికి లాభం పొందే అవ‌కాశం పోతుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

పోర్టుఫోలియో:

పెట్టుబ‌డుల‌ను కొంతకాలానికి చేసినా దీర్ఘ‌కాలికానికి చేసినా వైవిధ్య‌త ఉండేలా మ‌దుప‌ర్లు చూసుకోవాలి. అంటే 10 రంగాల‌కు చెందిన ప10 షేర్ల‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ రంగంలో మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచే కంపెనీల‌ను ఎంచుకోవాలి. ఇలా వివిధ రంగాల‌కు చెందిన షేర్లను ఎంపిక‌చేసుకోవ‌డం ద్వారా కొన్ని స్టాప్ లాస్ లు ట్రిగ‌ర్ అయ్యి న‌ష్టం తెచ్చిన కొన్ని లాభాల‌ను తెస్తాయి.

కంపెనీ ఫండ‌మెంట‌ల్ వివ‌రాలు:

షేర‌ల్లో పెట్టుబ‌డి చేసేముందు అది త‌క్కువ కాలంపాటు అయినా స‌రే ఆ సంస్థ తాలుకా ఫండ‌మెంట‌ల్ అంశాల‌ను తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు కింగ్‌ఫ్రిష‌ర్ ఎయిర్ లైన్స్ కంపెనీ ఫండ‌మెంట‌ల్ వివ‌రాలు గ‌మ‌నిస్తే గ‌త కొంత కాలంగా లాభాలు రాక‌పోవ‌డం, మ‌రో వైపు రుణం పెరుగుతుండ‌టం గ‌మ‌నించొచ్చు. ఆ స‌మ‌యంలో వాటిని కొనుగోలు చేస్తే మ‌దుప‌ర్లు న‌ష్ట‌పోవాల్సిందే.త‌రువాత అదే జ‌రిగింది కూడా. అయితే ఇలా ఉండే కంపెనీల‌కు ప్రోత్సాహ‌కాలు లేదా యాజ‌మాన్యం మార్పు,వ్యాపార ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు చేసేట్టైతే ఆ కంపెనీలు మ‌ళ్లీ తిరిగి పుంజుకునే అవ‌కాశ‌ముంటుంది.

నిపుణుల స‌ల‌హాలు:

పెట్టుబ‌డి విష‌యాల్లో మీ లాంటి ఆలోచ‌న ఉండే వారితో క‌లిసి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా క‌చ్చిత‌త్వం పెరుగుతుంది. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి కొన‌సాగించే ఉద్దేశం ఉంటే నిపుణుల స‌ల‌హాల‌ను తీసుకోవ‌డం మంచిది.

అన్నింటికీ ఆందోళ‌న చెందొద్దు:

మార్కెట్లో వ‌చ్చే వివిధ వార్త‌ల‌కు మ‌దుప‌ర్లు అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెంది నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దు. స్వ‌ల్ప‌కాలంలో ఒడిదొడుకులు వ‌చ్చినా త‌రువాత కాలంలో షేరు ధ‌ర పైకి రావ‌డం చాలా సంద‌ర్భాల్లో జ‌రిగింది. ఉదాహ‌ర‌ణ‌కు మ్యాగీ నూడిల్స్ లో ప‌రిమితికి మించి లెడ్, మోనోసోడియం వాడుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌లతో నెస్ట్లే షేరు ధ‌ర రూ.7000 నుంచి రూ.5500 కు ప‌డింది. తర్వాత ఆ షేరు ధ‌ర‌ రూ.11000 అయింది. ఆ స‌మ‌యంలో ఆందోళ‌న ప‌డి విక్ర‌యించిన వారికి లాభాల‌ను పొందే అవ‌కాశం పోయింది.

లెవ‌రేజ్:

లెవ‌రేజ్ అంటే రుణం అనొచ్చు. పెట్టుబ‌డి చేసేందుకు బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చే అధిక లిమిట్ ల‌ను తీసుకుని చేయ‌డం ద్వారా కొంత‌ ఆందోళ‌న చెందొచ్చు. ముఖ్యంగా మార్కెట్లు బాలేన‌పుడు లెవ‌రేజ్ తీసుకుని పెట్టుబ‌డుల‌ను చేయ‌డం ద్వారా ఆందోళ‌నతో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోక‌పోయే ప్ర‌మాద‌ముంటుంది. కాబ‌ట్టి మీరు ఎంత మొత్తంలో నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని అనుకుంటున్నారో ఆ మేర‌కు లెవ‌రేజ్ తీసుకుంటే ఏదైనా ప్ర‌తికూల‌త ఎదురైనా కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని