Sundar Pichai: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై దృష్టిపెడతాం: సుందర్‌ పిచాయ్‌

బ్లాక్‌ చైన్‌, ఇతర వెబ్‌3 టెక్నాలజీస్‌ అభివృద్ధిపై గూగుల్‌ దృష్టిపెట్టిందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. కంపెనీ నాలుగో త్రైమాసిక ఆ

Updated : 02 Feb 2022 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్లాక్‌ చైన్‌, ఇతర వెబ్‌3 టెక్నాలజీస్‌ అభివృద్ధిపై గూగుల్‌ దృష్టిపెట్టిందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. కంపెనీ నాలుగో త్రైమాసిక ఎర్నింగ్‌ కాల్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వెబ్‌3పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మేం కచ్చితంగా బ్లాక్‌  చైన్‌ లేదా అటువంటి శక్తిమంతమైన టెక్నాలజీలపై విస్తృతమైన అప్లికేషన్ల ద్వారా దృష్టిపెడతాం. మా క్లౌడ్‌ వినియోగదారులకు బ్లాక్‌ చైన్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లపై సేవలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నాం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ సంస్థ క్రియేటర్లు నాన్‌ ఫాంజిబుల్‌ టోకెన్లను నగదు రూపంలోకి మార్చుకొనే మార్గాలను అన్వేషిస్తున్నట్లు యూట్యూబ్‌ సీఈవో సుశాన్‌ ఇటీవల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘మేం వెబ్‌3లో వచ్చే మార్పులను అనుసరిస్తుంటాం. యూట్యూబ్‌లో సృజనాత్మకతను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. కంటెంట్‌ క్రియేటర్లు, వారి అభిమానుల మధ్యలో ఎదగడానికి ఉన్న అవకాశాలను క్రిప్టో, డీసెంట్రలైజ్‌డ్‌ ఆటానమస్‌ ఆర్గనైజేషన్స్‌ వెల్లడించాయి’’ అని సుశాన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని