Anil Agarwal: వ్యాపారాల విభజనపై ముందుకెళ్తున్నాం

వ్యాపారాల విభజన ప్రణాళికపై కంపెనీ ముందుకెళ్తున్నట్లు వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. వేదాంతాను ఆరు కంపెనీలుగా విభజించడం ద్వారా వాటి విలువ భారీగా పెరుగుతుందని 59వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో తెలిపారు.

Updated : 11 Jul 2024 02:25 IST

వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌

దిల్లీ: వ్యాపారాల విభజన ప్రణాళికపై కంపెనీ ముందుకెళ్తున్నట్లు వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. వేదాంతాను ఆరు కంపెనీలుగా విభజించడం ద్వారా వాటి విలువ భారీగా పెరుగుతుందని 59వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో తెలిపారు. వ్యాపారాల విభజనకు ఇప్పటికే మెజారిటీ రుణదాతల నుంచి అనుమతులు లభించాయి. దీంతో ఆరు స్వతంత్ర నమోదిత కంపెనీలుగా విభజించాలన్న కంపెనీ ప్రణాళికలో కీలక ముందడుగు పడింది. విభజన తర్వాత ఏర్పాటైన ప్రతీ సంస్థా స్వతంత్రంగా పనిచేస్తుందని, అయితే వేదాంతా మూల విలువలు, వ్యాపార సిద్ధాంతాలు, అంతర్జాతీయ నాయకత్వాన్ని పాటిస్తాయని అగర్వాల్‌ స్పష్టం చేశారు. మూలధన కేటాయింపు, వారి వృద్ధి వ్యూహాల విషయంలో ప్రతి సంస్థకు స్వతంత్రత పెరుగుతుందని, పెట్టుబడిదార్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకునే వీలుందని వెల్లడించారు. ప్రస్తుతం ఒక్క షేరు కలిగిన వేదాంతా వాటాదార్లకు,  5 కొత్త నమోదిత కంపెనీల్లో ఒక్కో షేరు అదనంగా లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం వేదాంతా ఆదాయంలో 70% అరుదైన ఖనిజాల నుంచే వస్తోందని, ఈ లోహాలు, ఖనిజాలను స్థిరంగా ఉత్పత్తి చేయడానికి వేదాంతా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. 

  • అల్యూమినియం, చమురు-గ్యాస్, ఉక్కు సహా అయిదు కీలక వ్యాపారాలను విడదీసి ప్రత్యేక నమోదిత సంస్థలుగా ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది సెప్టెంబరులో వేదాంతా ప్రకటించింది. హిందుస్థాన్‌ జింక్‌లో 65 శాతం వాటాను, స్టెయిన్‌లెస్‌ స్టీల్, సెమీకండక్టర్‌/డిస్‌ప్లే వ్యాపారాలను వేదాంతా కొనసాగించనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని