Automobile: ఖరీదైన ఎలక్ట్రిక్‌ బైకులు తెస్తాం!

వివిధ విపణుల్లోని వినియోగదారుల అభిరుచులకు తగ్టట్లుగా ఖరీదైన ఎలక్ట్రిక్‌ బైకులను అభివృద్ధి చేయనున్నట్లు ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. క్లాసిక్, బుల్లెట్, హిమాలయన్, ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ 650, కాంటినెంటల్‌ జీటీ 650 బ్రాండ్లతో మోటర్‌సైకిళ్లను విక్రయించ......

Published : 25 Jul 2021 22:35 IST

ఐషర్‌ మోటార్స్‌

దిల్లీ: వివిధ విపణుల్లోని వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఖరీదైన ఎలక్ట్రిక్‌ బైకులను అభివృద్ధి చేయనున్నట్లు ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. క్లాసిక్, బుల్లెట్, హిమాలయన్, ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ 650, కాంటినెంటల్‌ జీటీ 650 బ్రాండ్లతో మోటర్‌సైకిళ్లను విక్రయించే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ, ఐషర్‌ మోటర్స్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ వాహనాలు తయారు చేస్తాం. అదే సమయంలో పెట్రో ఇంజన్‌ వాహనాల అభివృద్ధిపైనా దృష్టి కొనసాగిస్తామ’ని 2020-21 వార్షిక నివేదికలో ఐషర్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ లాల్‌ తెలిపారు. ఇందుకు తగినంత సామర్థ్యం, విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ తమకున్నాయని వివరించారు. 250 సీసీ- 750 సీసీ బైకుల విభాగంలో అగ్రగామిగా ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గత ఆర్థిక సంవత్సరంలో 6,08,403 మోటర్‌సైకిళ్లను విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని