Air India: పరిమిత జ్యువెలరీ ధరించండి.. ఎయిరిండియా సిబ్బందికి టాటాల సూచన

ఎయిరిండియాలో సమయపాలనను మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్‌ చర్యలు మొదలుపెట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా విమాన సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది.

Published : 13 Feb 2022 21:30 IST

ముంబయి: ఎయిరిండియాలో సమయపాలనను మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్‌ చర్యలు మొదలుపెట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా విమాన సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించాలని, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాపింగ్‌లు వంటివి చేయొద్దని పేర్కొంది. ఈ మేరకు ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వసుధ చందన సిబ్బందికి ఆదివారం సర్క్యులర్‌ జారీ చేశారు.

విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్‌ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్‌లో ఆమె పేర్కొన్నారు. కస్టమ్స్‌, సెక్యూరిటీ చెక్‌ల వద్ద జాప్యాన్ని నిరోధించడానికి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. సిబ్బంది నిర్దేశించిన సమయంలోగా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

అలాగే, ఇమ్మిగ్రేషన్‌, భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత డ్యూటీ-ఫ్రీ షాప్స్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత సిబ్బంది వారి ముందు పానీయాలు తాగడం గానీ, ఆహార పదార్థాల తినడం గానీ చేయకూడదని తెలిపారు. ఏకరూప దుస్తులు ధరించి చక్కటి ఆహార్యంతో ఉన్నప్పుడే ప్రయాణికుల్లో సిబ్బంది పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని