Wells Fargo: ‘మౌస్‌ జిగ్లింగ్‌’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?

Wells Fargo: మౌస్‌ జిగ్లింగ్‌ అంటే ఏంటి? ఈ చర్యకు పాల్పడిన వారిని వెల్స్‌ ఫార్గో ఎందుకు తొలగించింది?

Updated : 15 Jun 2024 18:33 IST

Wells Fargo | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మిస్తున్న వారిపై అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంక్‌ వెల్స్‌ ఫార్గో కఠిన చర్యలు తీసుకుంది. విధులు నిర్వర్తిస్తున్నట్లు నమ్మించేందుకు చాలామంది ఉద్యోగులు ‘‘మౌస్ జిగ్లింగ్’’ కు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో వెంటనే వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ ఏంటా మౌస్ జిగ్లింగ్? ఈతరహా మోసానికి పాల్పడిన ఉద్యోగులను సదరు కంపెనీ ఎలా గుర్తించింది?

ఎక్కువసేపు స్క్రీన్‌ వాడకుండా ఉంటే సిస్టం స్లీప్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అయితే ఇలా స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లకుండా నియంత్రించే పరికరమే ఇది. మానవ ప్రమేయం లేకుండానే మౌస్‌ కర్సర్‌ని యాక్టివేట్‌ చేస్తుంటుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు ఇంటినుంచి పని చేసే సదుపాయం ఉంది. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా పని మీద ఎక్కువసేపు బయటకు వెళ్లాల్సివచ్చినా లేదా ఇంకేదైనా పని ఎదురైనా కంప్యూటర్‌ను యాక్టివేట్‌గా ఉంచేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది నిరంతరంగా మౌస్‌ను కదిలిస్తుంటుంది. దీంతో ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ భ్రమించే అవకాశం ఉంది. 

ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌ కార్డ్‌లు కొనుగోలు చేయొచ్చు..?

ఎలా గుర్తించాలి?

  •  కంపెనీకి సంబంధించిన కంప్యూటర్‌లో మౌస్‌ జిగ్లింగ్‌కి సంబంధించి ఎలాంటి అనధికార యాప్‌లు ఉన్నాయో, లేదో తనిఖీ చేయండి. 
  • మౌస్ జిగ్లర్‌లు కేవలం మౌస్‌ను మాత్రమే కదిలిస్తాయి. ఎటువంటి సందేశాలకు ప్రతిస్పందించవు. కాల్‌లో పాల్గొనడం వంటి పనులు చేయలేవు. 
  •  మౌస్ కదలికలను ప్రత్యేకమైన యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల ద్వారా ట్రాక్‌ చేయొచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని