Credit Card Usage: క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యం చేస్తే ఏమవుతుంది?

క్రెడిట్‌ కార్డుల వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. ఆ బిల్లులను సమయానికి చెల్లించకపోతే వచ్చే కష్టాలూ అన్నే ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం. 

Updated : 23 Apr 2023 17:42 IST

ఆలస్యం అమృతం విషం.. అంటుంటారు పెద్దలు. అది క్రెడిట్‌ కార్డుల (Credit Cards) చెల్లింపుల విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం. కార్డు చెల్లింపులు ఆలస్యం చేస్తూ పోతే.. కార్డు కంపెనీకి మీరు కట్టాల్సిన మొత్తం పెరుగుతూ పోతుంది. (Credit Cards Usage)

  1. క్రెడిట్‌ కార్డు బిల్లులు ఆలస్యంగా చెల్లించడం మంచి అలవాటు కాదు. ఒక్కోసారి అది మీ ఆర్థిక ప్రణాళికలను దెబ్బ తీయొచ్చు. చెల్లింపులు ఆలస్యం చేస్తే అధిక వడ్డీ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
  2. ఆటోమేటిక్‌ చెల్లింపుల ద్వారా సకాలంలో బకాయిలు తీర్చాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి కార్డు సంస్థలు మీ క్రెడిట్‌ పరిమితిని పెంచొచ్చు. రెండోది మీ క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది.
  3. సకాలంలో బిల్లులు కట్టకపోతే ఆలస్యపు రుసుములు విధిస్తారు. ఇవి ఖరీదైనవి. చెల్లింపుల ఆలస్యం కొనసాగుతున్న పక్షంలో ఇవి మరింతగా పెరుగుతాయి.
  4. బకాయిల ఆలస్యం వల్ల క్రెడిట్‌ స్కోరుకూ ఇబ్బంది రావొచ్చు.  భవిష్యత్‌లో కొత్త రుణాలను తీసుకునే సమయంలో స్కోరును పెంచుకోవడం కష్టం కావొచ్చు.
  5. తరచూ చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటే సదరు కంపెనీ ఏజెంట్లు ఫోన్‌ చేసి, బిల్లు కట్టించుకోవడానికి యత్నించవచ్చు. అది మీ వ్యక్తిగత జీవితంపై, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెంచవచ్చు.
  6. తరచూ సమయానికి చెల్లింపులు జరగకపోతే వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేకపోలేదు. సకాలంలో చెల్లింపుల వల్ల దీర్ఘకాలంలో మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఆలస్యపు రుసుములు, అధిక వడ్డీ రేట్ల వల్ల మీరు కష్టపడ్డ సొమ్ము కాస్తా వీటికే పెట్టాల్సి వస్తుంది.
  7. చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటే ఆ కంపెనీ మీపై చట్టపరమైన చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు. దీని వల్ల మీ విలువైన సమయం వృథా అవడమే కాకుండా.. డబ్బులూ ఖర్చవుతాయి. ఇది మీ ఆర్థిక భవితవ్యంపై ప్రతికూలంగా పనిచేయొచ్చు.
  8. కొత్త రుణాలు తీసుకోవడానికైనా, భవిష్యత్‌లో ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉండాలన్నా.. సకాలంలో క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని