యులిప్స్‌లో విధించే వివిధ ఛార్జీలు!

యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌లో విధించే వివిధ ఛార్జీల గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Published : 20 Dec 2020 19:39 IST

బీమాతో పాటు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి కూడా వీలు క‌ల్పించే పాల‌సీల‌ను యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ పాల‌సీ(యులిప్స్‌) అంటారు. ఈ యులిప్స్‌ల‌లో సంబంధిత బీమా కంపెనీలు ర‌క‌ర‌కాల ఛార్జీలు, ఫీజుల‌ను వ‌సూలు చేస్తారు. ఇది ఆయా కంపెనీల‌ను బ‌ట్టి మారుతూ ఉంటాయి. వీటిని నిర్ణీత కాలానికి సంబంధించి మార్చే అధికారం ఆయా కంపెనీల‌కు ఉంటుంది. యులిప్స్‌ల‌లో విధించే ర‌క‌ర‌కాల ఛార్జీలు, ఫీజుల గురించి ఈ కింద వివ‌రించ‌డం జ‌రిగింది.

ప్రీమియం అలోకేష‌న్ ఛార్జీ

పాల‌సీలో యూనిట్ల‌ను కేటాయించ‌క‌ముందు ప్రీమియంలో కొత్త మొత్తాన్ని కంపెనీ ప్రీమియం అలోకేష‌న్ ఛార్జీ రూపంలో మిన‌హాయించుకుంటుంది. ఇందులో క‌మీష‌న్ ఛార్జీలు మిన‌హా ప్రాథ‌మిక, పున‌రుద్ధ‌ర‌ణ‌క‌య్యే ఇత‌ర ఛార్జీలు క‌లిసి ఉంటాయి.

మోర్టాలిటీ ఛార్జీలు

ప‌థ‌కంలో బీమా క‌వ‌రేజీ క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే వ్య‌యం కోసం ఈ ఛార్జీల‌ను విధిస్తారు. ఇది పాల‌సీదారుడి వ‌య‌సు, బీమా క‌వ‌రేజీ మొత్తం, ఆరోగ్య స్థితిని బ‌ట్టి మారుతూ ఉంటుంది.

ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు

ఫండ్ నిర్వ‌హ‌ణ కోసం ఈ ఛార్జీల‌ను విధిస్తారు. సాధార‌ణంగా నిక‌ర ఆస్తి విలువ(ఎన్ఏవీ) చేర‌డానికి ముందు, ప‌థ‌కం చివ‌రిలో దీనిని వ‌సూలు చేస్తారు.

పాల‌సీ నిర్వ‌హ‌ణ ఛార్జీలు

సాధార‌ణంగా దీనిని ఫండ్‌ యూనిట్ల‌ను ర‌ద్దు చేయ‌డం ద్వారా విధిస్తారు. ఇది పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో స్థిరంగానే ఉంటుంది.

స‌రెండ‌ర్(స్వాధీన) ఛార్జీలు

పాల‌సీ మెచ్యూర్ కాక‌ముందు పాక్షికంగా లేదా పూర్తిగా యూనిట్ల‌ను న‌గ‌దు రూపంలో మార్చుకున్నందుకు విధిస్తారు.

ఫండ్ స్విచ్ఛింగ్ ఛార్జీలు

పాల‌సీదారుడు ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్‌కి మారేట‌ప్పుడు ఈ ఛార్జీల‌ను విధిస్తారు. కంపెనీలు సాధారణంగా ప్ర‌తీ ఏడాది ప‌రిమిత సంఖ్య‌లో ఛార్జీలు విధించ‌కుండా అవ‌కాశ‌మిస్తాయి. ప‌రిమితి దాటితో ఛార్జీల‌ను విధిస్తాయి.

సేవా ప‌న్ను రుసుములు

యూనిట్ల‌ను కేటాయించ‌క ముందు ప్రీమియంలోని రిస్క్ పోర్ష‌న్ నుంచి దీనిని మిన‌హాయిస్తారు. రిస్క్ పోర్ష‌న్ నుంచి అన్ని ఛార్జీల‌ను మిన‌హాయించిన త‌ర్వాత మ‌దుప‌రులు యూనిట్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని