
సిబిల్ స్కోరు అంటే ఏంటి? ఆన్‌లైన్ ద్వారా ఏవిధంగా చెక్ చేసుకోవచ్చు?
సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.
సాధారణంగా 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులు రుణాలను తర్వగా మంజూరు చేస్తాయి. దీర్ఘకాల రుణాల విషయంలో.. తక్కువ వడ్డీ రేటుకే రుణాలను మంజూరు చేసే అవకాశమూ ఉంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు క్రెడిట్ స్కోరును తెలుసుకోవడం మంచిది. ఒకవేళ మీకు తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే వృద్ధి చేసుకునే ప్రయత్నమూ చేయవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా సిబిల్ స్కోరు చెక్ చేసుకోవడం ఎలా?
* ముందుగా సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
* ‘గెట్ యువర్ సిబిల్ స్కోర్’ ను ఎంచుకోవాలి.
* ఇక్కడ మీకు పేమెంట్స్ పేజి ఓపెన్ అవుతుంది.
* ఒక నెల, ఆరు నెలలు, సంవత్సరానికి ‘సబ్‌స్క్రైబ్’ చేసుకోవచ్చు.
* మీకు కావాల్సిన కాలపరిమితిని ఎంచుకున్న తర్వాత కింద ఉన్న ‘గెట్ స్టార్టెడ్’పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీకు అక్కౌంట్ క్రియేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, ఈ-మెయిల్ ఐడి, పాస్ వర్డ్, గుర్తింపు కార్డు నంబరు ( పాన్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ లలో ఏదైనా ఇవ్వచ్చు), పుట్టిన తేది, పిన్‌కోడ్, మొబైల్ నంబరు తదితర వివరాలను ఎంటర్ చేసి ‘యక్సప్ట్ అండ్ కంటిన్యూ’ బటన్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకి ‘ఓటీపీ’ (ఒన్ - టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ‘ఓటీపీ’ని ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
* మీ ఐడి వెరిఫై చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
* ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత ‘మెంబర్ లాగిన్’ పై క్లిక్ చేసి లాగినవ్వడం ద్వారా సిబిల్ స్కోరును తెలుసుకోవచ్చు.
భారత్‌లో క్రెడిట్ స్కోరు అందిస్తున్న మొట్టమొదటి క్రెడిట్ బ్యూరో సిబిల్. ప్రస్తుతం ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర సంస్థలు క్రెడిట్ స్కోరును అందిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
arshdeep: ఉమ్రాన్ ఓకే.. మరి అర్ష్‌దీప్ సంగతేంటి?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు
-
General News
Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌కు బదులు ట్యాబ్‌లు!
-
General News
Telangana news: కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
-
Politics News
Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్
-
Movies News
Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!