మీకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందా?
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం...
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం
ఉద్యోగ భవిష్య నిధి సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్టయితే ఈ పథకం కింద వారి కుటుంబసభ్యులకు, నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు బీమా పరిహారంగా రూ. 3లక్షలు అందుతుంది. దీన్నే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైనవారు: ఈపీఎఫ్ సభ్యుడు తన ఖాతాకు సంబంధించి పేర్కొన్న నామినీ, నామినీగా ఎవరినీ పేర్కొనకపోయినట్టయితే కుటుంబసభ్యులలో ఎవరైనా ఒకరు దరఖాస్తు చేసుకోవచ్చు, కుటుంబసభ్యులు లేదా నామినీలు ఎవరూ లేకపోతే చట్టబద్ధ వారసులు దరఖాస్తు చేసేందుకు అర్హులు, నామినీ మైనర్ అయినట్టయితే సంరక్షకుడు దరఖాస్తు చేయవచ్చు. చట్ట ప్రకారం, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, 1976 చట్టం ప్రకారం ఈపీఎఫ్ సభ్యుడు సర్వీసులో ఉండగా మృతిచెందితేనే ఈ పథకం కింద బీమా పరిహారం అందుతుంది.
అన్ని ప్రయోజనాలు ఒకేసారి:
- ఈ పథకం కింద బీమా పరిహారం క్లెయిం చేసుకునేందుకు ఫారం 5(ఐ.ఎఫ్)ను ఉపయోగించాలి.
- దీంతోపాటు ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము క్లెయిం కోసం వాడే ఫారం 20ను, పింఛను నగదు ఉపసంహరించుకోవడానికి ఉపయోగించే ఫారం 10 డీ లేదా 10 సీ దరఖాస్తులను అందించి మూడు ప్రయోజనాలను ఒకేసారి పొందవచ్చు.
దరఖాస్తు సూచనలు:
-
ఫారం 5 (ఐ.ఎఫ్)లో అన్ని వివరాలను పెద్ద అక్షరాల్లో (బ్లాక్ లెటర్స్) పూరించాలి. ఎలాంటి కొట్టివేతలకు అవకాశం ఇవ్వకూడదు.
-
ఒక వేళ మరణించిన వ్యక్తి వివాహిత అయినట్టయితే ఆమె భర్త పేరును ఫారంలోని కాలమ్ 1(బీ)లో పేర్కొనాలి.
-
ఈపీఎఫ్ ఖాతా సంఖ్య: ఖాతా సంఖ్య ప్రాంతం కోడ్(రెండు అక్షరాలు), కార్యాలయం కోడ్ (మూడు అక్షరాలు), ఎక్స్టెన్షన్ కోడ్( మూడక్షరాలు), ఖాతా సంఖ్య (గరిష్ఠంగా ఏడు సంఖ్యలు)తో కూడినదై ఉండాలి.
-
బ్యాంకు ఖాతా వివరాలు: క్లెయిం సొమ్మును నేరుగా అందించరు. బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. ఇందుకోసం క్లెయిం చేసుకునే వ్యక్తి తన బ్యాంకు ఖాతా సంఖ్య, శాఖ, బ్యాంకు పేరు, దాని చిరునామా వివరాలను ఫారంలో రాయాలి.
దీన్ని ధ్రువీకరించేందుకు బ్యాంకు స్టేట్మెంట్/ క్యాన్సిల్ చేసిన చెక్కు క్లెయిం ఫారానికి జతచేయాలి. -
చెల్లింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ఆర్డరు ద్వారా జరపరు. ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా గరిష్ఠంగా రూ.2వేల వరకే సొమ్ము పంపించగలుగుతారు.
క్లెయిం ఫారం అటెస్టేషన్:
-
పీఎఫ్ సభ్యుడు చివరగా ఎవరి దగ్గరైతే పనిచేశాడో ఆ సంస్థ యాజమాని చేత ఫారంపై అటెస్టేషన్ చేయించాలి.
-
ఒక వేళ సదరు సంస్థ మూతపడినా, అటెస్టేషన్ చేసేందుకు అధీకృత వ్యక్తి అందుబాటులో లేకపోయినా , ఫారాన్ని కింద తెలిపినా అధికారులలో ఎవరో ఒకరి దగ్గర అటెస్టేషన్ చేయించుకోవచ్చు.
- మేజిస్ట్రేట్ 2. గెజిటెడ్ అధికారి 3. పోస్టుమాస్టర్ 4. గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు 5. మున్సిపల్/జిల్లా బోర్డు ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడిలో ఎవరో ఒకరు 6. ఎమ్మెల్యే/ఎంపీ 7. ఈపీఎఫ్ ప్రాంతీయ కమిటీ సభ్యుడు 8. బ్యాంకు ఖాతా కలిగి ఉన్న బ్రాంచీ మేనేజర్ 9. గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ ముఖ్యుడు.
జతచేయాల్సిన పత్రాలు:
- పీఎఫ్ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రం
- మైనర్ పేరిట క్లెయిం చేస్తున్నట్టయితే సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నట్టు ఆధారం
- చట్టబద్ధ వారసుడైతే దాన్ని ధ్రువీకరిస్తూ ఏదైనా పత్రం
- చెల్లింపు జరపదల్చుకున్న బ్యాంకుకు సంబంధించిన క్యాన్సిల్ చేసిన చెక్కు కాపీ
ఈ పథకం కోసం పీఎఫ్ సభ్యుడు ప్రత్యేకంగా ఎలాంటి డిపాజిట్టు చేయవనవసరం లేదు. సంస్థ యాజమానే మూలవేతనంలో నుంచి 0.5శాతం డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు విధిగా జమచేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!