సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్(ఎస్‌టీటీ) గురించి తెలుసా?

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉండే సెక్యురిటీల‌ను కొనుగోలు, అమ్మ‌కాలు చేసేట‌పుడు వ‌ర్తించే ప‌న్ను సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్(ఎస్‌టీటీ).......

Published : 19 Dec 2020 16:23 IST

సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్(ఎస్‌టీటీ) అంటే ఏంటి?

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉండే సెక్యురిటీల‌ను కొనుగోలు, అమ్మ‌కాలు చేసేట‌పుడు వ‌ర్తించే ప‌న్ను సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్(ఎస్‌టీటీ). షేర్లు, బాండ్లు, డిబెంచ‌ర్లు, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు మొద‌లైన వాటిని సెక్యూరిటీలుగా ప‌రిగ‌ణిస్తారు. క్లోజ్ ఎండెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్లు ఎక్స్ఛేంజీలో ట్రేడ‌వుతుంటాయి. డిబెంచ‌ర్లు , బాండ్లు స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల కేట‌గిరీ లోకి వ‌స్తాయి. మ‌దుప‌ర్ల‌కు ఎక్జిట్ ఆప్ష‌న్ క‌ల్పించేందుకు వీటిని కూడా ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తుంటారు.

  • ఈ ప‌న్ను అక్టోబ‌రు 2004 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది.
  • ఎస్‌టీటీ ట్రేడ్ చేసే పెట్టుబ‌డి సాధానం , కొన‌డ‌మా లేదా అమ్మ‌డ‌మా అనే అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.
  • ఈక్విటీ షేర్ల (డెలివ‌రీ) ను క్ర‌య‌విక్ర‌యాలు చేసే కొనుగోలుదారులు, అమ్మ‌కందారులు 0.1 శాతం ఎస్‌టీటీ చెల్లించాలి.
  • అదే విధంగా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ కొనుగోలు చేసేవారు ఎస్‌టీటీ చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. విక్ర‌యించేవారు మాత్రం 0.001 శాతం ఎస్‌టీటీ చెల్లించాలి. ఈ రేట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది.
  • ఎస్‌టీటీ ప్ర‌ధానంగా మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఎగ‌వేత‌ను త‌గ్గించేందుకు ఉద్దేశించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని