క్రెడిట్ కార్డు రద్దు ఎప్పుడంటే
డిజిటల్ ప్రపంచంలో క్రెడిట్ కార్డు ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. మంచి క్రెడిట్ స్కోరున్న వారికి బ్యాంకులు అడిగి మరీ ఈ కార్డులను ఇస్తుంటాయి.
డిజిటల్ ప్రపంచంలో క్రెడిట్ కార్డు ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. మంచి క్రెడిట్ స్కోరున్న వారికి బ్యాంకులు అడిగి మరీ ఈ కార్డులను ఇస్తుంటాయి. అవసరానికి మించి కార్డులున్నప్పుడు, మరీ తక్కువ క్రెడిట్ పరిమితితో ఉన్న వాటినీ సాధ్యమైనంత వరకూ వదిలించుకోవాలి.
క్రెడిట్ కార్డులు ఎప్పుడూ వీలైనంత గరిష్ఠ పరిమితితో ఉండేలా చూసుకోవాలి. అంటే అధికంగా ఖర్చు చేయాలని కాదు. మీ రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉండేలా చూసుకోవడానికి. ఉదాహరణకు మీ దగ్గర రూ.70వేల పరిమితితో క్రెడిట్ కార్డు ఉందనుకుందాం. అందులో నుంచి రూ.7 వేలు ఖర్చు చేస్తే 10 శాతం రుణ పరిమితిని వినియోగించుకున్నట్లు. అదే రూ.20వేల పరిమితితో కార్డు ఉందనుకోండి. రూ.2వేలు ఉపయోగించుకున్నా 10 శాతం పరిమితికి చేరుతుంది. తక్కువ పరిమితి ఉన్న కార్డుల వల్ల మీ రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి, మీ దగ్గర రెండు మూడు క్రెడిట్ కార్డులున్నప్పుడు అందులో తక్కువ పరిమితి కార్డును రద్దు చేసుకోండి.
* మీరు మొదట తీసుకున్న క్రెడిట్ కార్డును సాధ్యమైనంత వరకూ కొనసాగించాలి. దీర్ఘకాలంపాటు కొనసాగించారు కాబట్టి, మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు దానిపై ఆధారపడి ఉంటుంది. రద్దు చేసుకోవాల్సి వస్తే మీ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్తగా తీసుకున్న కార్డులను రద్దు చేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. పాత కార్డుకు వీలైనంత వరకూ పరిమితి పెంచాల్సిందిగా బ్యాంకును కోరాలి. అధిక వార్షిక రుసుము ఉంటే, దాన్ని తగ్గించాల్సిందిగా అడగాలి.
* కార్డును రద్దు చేసుకునే ముందు ఆ కార్డుకు ఉన్న రివార్డు పాయింట్లను వినియోగించుకోవాలి. చాలామంది ఈ రివార్డు పాయింట్లపై దృషి పెట్టరు. దీనివల్ల వేల పాయింట్లు అలా ఉండిపోతాయి. వీటన్నింటినీ ఏదైనా కొనుగోలు కోసం వాడుకోండి. ఆ తర్వాతే కార్డును నిలిపివేయండి.
* ఒక్క రూపాయి బాకీ ఉన్నా కార్డును రద్దు చేయడం కుదరదు. కాబట్టి, బిల్లు ఏమాత్రం బాకీ లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కొంత అధికంగా బిల్లు చెల్లించినా సరే.
* కార్డుపై ఎలాంటి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేకుండా చూసుకోండి. ఆ కార్డు ద్వారా ఏవైనా చెల్లింపులు వెళ్తుంటే ముందుగానే వాటిని మరో కార్డుకు మళ్లించాలి. ఇవన్నీ పూర్తి చేసి, నెల ఆగిన తర్వాతే ఆ కార్డును రద్దు చేసుకోండి.
* బాకీ మొత్తం చెల్లించాం, రివార్డు పాయింట్లను వాడుకున్నాం, ఇక ఆ కార్డుతో పనిలేదు అనుకున్నప్పుడే బ్యాంకును సంప్రదించండి. ఆన్‌లైన్, మొబైల్ యాప్‌లోనూ కార్డులను రద్దు చేసుకుంటున్నట్లు తెలియజేయొచ్చు. ఇ-మెయిల్, ఫోన్ ద్వారా, బ్యాంకు శాఖకు వెళ్లి కార్డును రద్దు చేసుకుంటున్నట్లు చెప్పొచ్చు.
* క్రెడిట్ కార్డు రద్దు చేయాలని కోరినప్పుడు బ్యాంకులు వెంటనే దాన్ని నిలిపివేస్తాయి. కానీ, మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. బ్యాంకు నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ క్రెడిట్ నివేదికలో కార్డును రద్దు చేసినట్లు కనిపించాలి. అప్పుడే మున్ముందు ఎలాంటి వివాదాలూ ఉండవు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Odisha Train Accident: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్‌ల చొరవ!
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు
-
India News
Bridge Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు