షేర్ల విభ‌జ‌నతో మ‌దుప‌ర్ల‌కు మేలెంత‌?

కంపెనీలు ప్ర‌క‌టించే షేర్ల విభ‌జ‌న ద్వారా మ‌దుప‌ర్ల‌కు లాభం ఉంటుందా?​​​​​.....

Published : 19 Dec 2020 10:46 IST

కంపెనీలు ప్ర‌క‌టించే షేర్ల విభ‌జ‌న ద్వారా మ‌దుప‌ర్ల‌కు లాభం ఉంటుందా?​​​​​​​

స్టాక్ ను విభ‌జంచ‌టం (స్టాక్ స్ప్లిట్‌)

కంపెనీలో ఉన్న షేర్లను వాటి ముఖ‌విలువ ఆధారంగా మ‌రిన్ని షేర్లుగా విభ‌జించ‌డాన్నే స్టాక్ స్ప్లిట్ అంటారు. స్టాక్ విభ‌జంచే నిష్ప‌త్తి ని కంపెనీ ముందుగా ప్ర‌క‌టిస్తుంది. షేరు ముఖ‌విలువ ఆధారంగా స్టాక్ విభ‌జ‌న జ‌రుగుతుంది . స్టాక్ విభ‌జ‌న అనంత‌రం షేరు ముఖ విలువ త‌గ్గుతుంది. దానికి అనుగుణంగా మార్కెట్ షేరు ధ‌ర కూడా స‌ర్దుకుంటుంది.

ఉదాహార‌ణ‌

కంపెనీలో షేర్ల సంఖ్య 1,00,00,000
షేరుముఖ విలువ రూ. 10
మార్కెట్లో షేరు విలువ రూ. 300
1:2 నిష్ప‌త్తిలో స్టాక్ ను విభ‌జిస్తే ప్ర‌తి షేరు రెండు షేర్లవుతుంది.

విభ‌జ‌న అనంత‌రం

కంపెనీలో షేర్ల సంఖ్య 2,00,00,000
షేరు ముఖ విలువ రూ.5
మార్కెట్లో షేరు ధ‌ర రూ.150
స్టాక్ ను విభ‌జించ‌డం వ‌ల్ల కంపెనీలో షేర్ల సంఖ్య పెరుగుతుంది కాని దాని విలువ లో మార్పుఉండ‌దు. మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల‌కు కు లిక్విడిటీ పెంచ‌డం కోసం స్టాక్ విభ‌జ‌న చేస్తారు.

సాధార‌ణంగా స్టాక్ విభ‌జ‌న అంటే ఉన్న షేర్లు విభ‌జ‌న జ‌రుగుతుంది. దీని మూలంగా మ‌దుప‌ర్ల‌కు వ‌చ్చిన లాభం ఏమైనా ఉందా అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే మీ ద‌గ్గ‌ర ఉన్న ఒక యాపిల్ ని ముక్క‌లుగా చేసి మ‌ళ్లీ మీకు ఇస్తే ఏమ‌వుతుంది. ఏం మార్పుండ‌దు. ఒక‌టే మార్పు ముందు యాపిల్ త‌రువాత యాపిల్ ముక్క‌లు అంతే మిగిలిందంతా ఒక‌టే. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈ స్టాక్ విభ‌జ‌న యాపిల్ ఉదాహ‌ర‌ణ‌తో పోల్చి చూడ‌వ‌చ్చు.

దీని మూలంగా లాభం జ‌ర‌గొచ్చు, జ‌రగక‌పోనూవ‌చ్చు. అయితే ఇది ఆయా ప‌రిస్థితులు ఆధారంగా ఉంటుంది. కంపెనీ చేసే వ్యాపారం, ప‌నీతీరు, మ‌దుప‌ర్ల అంచ‌నాల ఇలా చాలా విష‌యాలు ఈ స్టాక్ విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌భావం చూపిస్తాయి. అందుకే స్టాక్ స్ప్లిట్ ను అనుకూలమ‌ని చెప్ప‌లేం, ప్ర‌తికూల‌మ‌ని చెప్ప‌లేం.

దీని వ‌ల్ల క‌లిగే లాభం ఏంటంటే

షేర్ల‌కు మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ ధ‌ర ఉన్న షేరు విభ‌జ‌న త‌రువాత త‌క్కువ‌ధ‌రకు ల‌భిస్తుంది. దీని మూలంగా ధ‌ర ఆధారంగా కొనుగోలు చేసే మ‌దుప‌ర్లు వీటిని కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.దీంతో మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల‌కు డిమాండు పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆ షేరు ధ‌ర మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇది మ‌దుప‌ర్లు ఆక‌ర్షితులై పెట్టుబ‌డి చేస్తేనే. అదే స‌మ‌యంలో విభ‌జ‌న చేసిన అనంత‌రం కూడా మ‌దుప‌ర్లు ఆ కంపెనీ షేర్ల‌పై ఆ స‌క్తి చూప‌లేద‌నుకుందాం. అప్పుడు ప‌రిస్థితిలో ఎలాంటిమార్పుండ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని