Whatsapp: వాట్సాప్‌లో కొత్తగా ‘ఎడిట్’ ఆప్షన్..!
Whatsapp Edit message: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. మనం పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. ప్రస్తుతం బీటా దశలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం ఉంది. ఒకప్పుడైతే అదీ ఉండేది కాదు. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్‌ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ రానుంది.
వాట్సాప్ (WhatsApp) తీసుకొస్తున్న కొత్త ఫీచర్ కింద ఏదైనా సందేశాన్ని 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్‌తో పాటు ఎడిట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ‘ఎడిట్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లయినా ఎడిట్ చేసుకునే సదుపాయం ఉంది. ఒకసారి ఎడిట్ చేశాక ‘ఎడిటెడ్’ అనే సందేశం అవతలి వ్యక్తికి ఈ మెసేజ్ కింద కనిపిస్తుంది.
ఆండ్రాయిడ్ యాప్‌తో పాటు, ఐఓఎస్, వెబ్ యూజర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేదీ మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు. మరోవైపు అంతర్జాతీయ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు రింగ్ రాకుండా చేసే ఆప్షన్ సైతం ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
-
Movies News
Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్ సర్
-
General News
Amaravati: లింగమనేని రమేశ్ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు
-
India News
బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ
-
Sports News
IPL 2023: ధోనీ మేనియాగా ఈ ఐపీఎల్ సీజన్ : రమీజ్ రజా
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!