Meta: మెటా ఇండియాకు మరో ఇద్దరు ఉన్నతోద్యోగులు గుడ్‌బై!

మెటా ఇండియాకు మరో ఇద్దరు ఉన్నతోద్యోగులు రాజీనామా చేశారు. వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌, మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ తమ పదవుల నుంచి వైదొలిగారు.

Published : 15 Nov 2022 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా ఇండియా (Meta India)కు మరో ఇద్దరు ఉన్నతోద్యోగులు రాజీనామా చేశారు. వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌, మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ తమ పదవుల నుంచి వైదొలిగారు. వీరి రాజీనామాలను మెటా సైతం ధ్రువీకరించింది. రాజీవ్‌కు వేరే అవకాశం రావడంతో బాధ్యతల నుంచి వైదొలిగారని తెలిపింది. వాట్సాప్‌కు అభిజిత్‌ బోస్‌ అందించిన సేవలు అద్భుతమని వాట్సాప్‌ హెడ్‌ విల్‌క్యాత్‌కార్ట్‌ కొనియాడారు.

మెటా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ ఇద్దరూ రాజీనామా చేయడం గమనార్హం. అంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాట్సాప్‌ పేమెంట్‌ హెడ్‌ మనేశ్‌ మహాత్మే సైతం గుడ్‌బై చెప్పారు. అయితే, వీరు వైదొలగడానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదు. అజిత్‌ మోహన్‌ స్నాప్‌లో చేరగా.. వీరిద్దరి అడుగులు ఎటువైపన్నది తెలియరాలేదు. మరోవైపు మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా శివనాథ్‌ తుక్రల్‌ను మాతృ సంస్థ నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని