WhatsApp: గ్రూప్‌లో చేరాలంటే.. అడ్మిన్ అప్రూవ్‌ చేయాల్సిందే!

వాట్సాప్‌ గ్రూప్‌ (WhstApp Groups)లో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే.. గ్రూప్ అడ్మిన్‌ లేదా గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ద్వారా చేరేవారు. దీంతో చాలా మంది గ్రూప్‌లలో సభ్యులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో సభ్యుల చేరికను నియంత్రించేందుకు గ్రూప్‌ అడ్మిన్‌లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ (WhatsApp) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Updated : 13 Apr 2023 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్‌(WhastApp)లో ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్లు పరిచయం చేస్తున్నారు. ఇటీవల తీసుకొచ్చిన ఓ ఫీచర్‌ గ్రూప్‌ అడ్మిన్‌ (Group Admins)లకు తమ గ్రూప్‌పై పూర్తి అధికారాన్ని ఇస్తుంది. అప్రూవ్‌ న్యూ పార్టిసిపెంట్‌ (Approve New Participant) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండా కొత్తవారు గ్రూప్‌లో సభ్యులుగా చేరలేరు. గతంలో గ్రూప్‌లో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే.. గ్రూప్ అడ్మిన్‌ లేదా గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ద్వారా చేరేందుకు అవకాశం ఉండేది. దీంతో గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ చాలా మంది సభ్యులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో సభ్యుల చేరికను అదుపు చేసేందుకు గ్రూప్‌ అడ్మిన్‌లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రూప్‌ ఇన్విటేషన్‌ లింక్‌ లేదా ఇతరుల సూచన ద్వారా ఎవరైనా గ్రూప్‌లో సభ్యుల ద్వారా చేరాలంటే.. అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు అందుబాటులో ఉంది.

గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్నవారు గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్ చేస్తే గ్రూప్‌ సెట్టింగ్స్‌ సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్రూవ్‌ న్యూ పార్టిసిపెంట్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత గ్రూప్‌లో సభ్యులుగా చేరాలనుకునే వారు పంపిన రిక్వెస్ట్‌ను అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాలి. అలా గ్రూప్‌లో కొత్త వారి చేరికలపై అడ్మిన్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొస్తుంది. ఇందులో భాగంగా డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌(Disappearing Messages)లో ప్రస్తుతం ఉన్న టైమ్‌ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్లు తమ వ్యక్తిగత చాట్లపై పూర్తి నియంత్రణ, గోప్యత, భద్రత కోసం లాక్‌ చాట్‌ (Lock Chat) అనే ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. వీటితోపాటు ఆండ్రాయిడ్ యూజర్లకు ఐఓఎస్‌ యాప్‌ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని