Whatsapp: ‘స్కామ్’ కాల్స్‌కు చెక్.. త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్!
Whatsapp working on New feature: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. స్పామ్ కాల్స్‌ను నిరోధించడమే లక్ష్యంగా ఈ ఫీచర్ ఉండబోతోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే...
ఇంటర్నెట్ డెస్క్: మనకు స్కామ్/ స్పామ్ కాల్స్ సాధారణ కాల్స్ రూపంలో వస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల అలాంటి కాల్స్‌ను గుర్తించడం వీలు పడుతోంది. దీంతో అలాంటి కాల్స్‌ను బ్లాక్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒకసారి బ్లాక్ చేస్తే మళ్లీ అదే నంబర్ నుంచి కాల్స్ రావు. దీంతో స్పామ్ కాల్ చేసే వారు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నేరుగా వాట్సాప్ నంబర్లకే (Whatsapp calls) కాల్ చేస్తున్నారు. ఏ నంబర్‌కైనా కాల్ చేసే వెసులుబాటు వాట్సాప్ (Whatsapp) కల్పిస్తుండడంతో ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ అందుకునే వెసులుబాటు దొరుకుతోంది. ఇలాంటి కాల్స్‌కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ పేరిట ఈ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోందని వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్‌కు రింగ్ రాకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు కేవలం నోటిఫికేషన్ బార్‌లో మాత్రమే కనిపిస్తుంది. అంటే మన ఫోన్ నంబర్ల జాబితాలో లేని ఎవరైనా కొత్త వ్యక్తులు మనకు ఫోన్ చేసినప్పుడు మీకు రింగ్ రాదన్నమాట. ఒకవేళ ఏదైనా విషయం చెప్పదలచుకుంటే మెసేజ్ రూపంలో తెలియజేస్తే అప్పుడు యూజర్ తన ఇష్టం మేరకు తిరిగి కాల్/ మెసేజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Crime News
Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
-
Crime News
Murder Case: హయత్‌నగర్‌లో వృద్ధురాలి హత్య.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Sports News
Kohli: ఆ రెండు సిరీస్‌ల్లో విజయాల తర్వాత ఆసీస్ మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు: విరాట్ కోహ్లీ