Whatsapp: ‘అంతర్జాతీయ కాల్స్’పై స్పందించిన వాట్సాప్
WhatsApp on International: అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్స్‌పై వాట్సాప్ స్పందించింది. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాలని వాట్సాప్ సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో గత కొద్ది రోజులుగా వాట్సాప్ (Whatsapp) యూజర్లను అంతర్జాతీయ కాల్స్ (International Calls) వేధిస్తు్న్నాయి. ముఖ్యంగా మలేసియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి ఐఎస్‌డీ కోడ్‌లు కలిగిన నంబర్లతో ఈ ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో కొన్ని ఆడియో కాల్స్ కాగా.. మరికొన్ని వీడియో కాల్స్ ఉంటున్నాయి. ఇంతకీ ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారు? వారి అసలు ఉద్దేశం ఏమిటి? వారికి ఈ నంబర్లు ఎలా చేరాయి? అనే వివరాలు ప్రస్తుతానికైతే తెలియరాలేదు. అయితే, గత కొన్ని రోజులుగా దీనిపై యూజర్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై వాట్సాప్ తొలిసారి స్పందించింది.
ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సదరు నంబర్‌ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని వినియోగదారులకు వాట్సాప్ సూచించింది. రిపోర్ట్ చేసిన వెంటనే ఆ నంబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దేశ విదేశాల నుంచి ఏవైనా అనుమానాస్పద కాల్స్/ సందేశాలు వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాలని యూజర్లకు సూచించింది. అలాగే వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ప్రైవసీ కంట్రోల్‌లోకి వెళ్లి కాంటాక్టుల్లోని వ్యక్తులకు మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మోసాల నుంచి రక్షణ కోసం ఇప్పటికే తాము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమ వేదికను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఏఐ, ఇతర టెక్నాలజిపై వెచ్చిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
కాల్స్ వస్తే ఏం చేయాలి?
సాధారణంగా ఇంటర్నేషనల్ కాల్స్ (International Calls) చేసే వారు ఫేక్ జాబ్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టండి.. వీడియోకు ఇంత మొత్తం చెల్లిస్తామని ఆఫర్ చేస్తారు. తర్వాత ఎక్కువ మొత్తంలో చెల్లిస్తామని ఆశ చూపి పెద్ద మొత్తంలో దోచే ప్రమాదముందని చెప్తున్నారు. మరికొందరు వర్క్‌ఫ్రమ్ హోమ్‌పేరిట మోసాలకు పాల్పడుతున్నారని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అనుమానాస్పద కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా కాల్స్ వస్తే వెంటనే.. ఆ నంబర్‌పై క్లిక్ చేసి త్రీ డాట్స్ మెనూలోకి వెళ్లి ‘బ్లాక్’ చేయాలని సూచిస్తున్నారు. ఒకసారి బ్లాక్ చేసిన నంబర్ నుంచి ఎలాంటి కాల్స్, మెసేజ్‌లు రావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం
-
HP Chromebooks: గూగుల్‌తో హెచ్‌పీ జట్టు.. భారత్‌లోనే క్రోమ్ బుక్స్ తయారీ
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం
-
Bengaluru traffic : కారులో నుంచి ఆర్డర్ చేస్తే పిజ్జా వచ్చేసింది.. అట్లుంటది బెంగళూరు ట్రాఫిక్!