Whatsapp: ఇలా చేస్తే మీ ఖాతాలు సేఫ్.. వాట్సాప్ సేఫ్టీ క్యాంపెయిన్
WhatsApp safety campaign: యూజర్ల ఖాతాల భద్రత కోసం వాట్సాప్ సేఫ్టీ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌లో ఉన్న ఫీచర్లను ఎలా వినియోగించుకోవాలో సూచిస్తోంది.
దిల్లీ: డిజిటల్ భద్రతలో భాగంగా యూజర్లు తమ ఖాతాలను రక్షించుకోవడంపై ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ‘వాట్సాప్‌తో సురక్షితంగా ఉండండి’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారుల భద్రతే ప్రధాన ధ్యేయంగా ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాలు, బెదిరింపుల నుంచి తమను తాము యూజర్లు ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తూ కొన్ని సూచనలు చేసింది. అందుకోసం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లను ఎలా వినియోగించుకోవాలో తెలియజేసింది.
- టు- స్టెప్ వెరిఫికేషన్: వాట్సాప్‌లో ఉన్న భద్రతా ఫీచర్లలో టు-స్టెప్ వెరిఫికేషన్ ఒకటి. మీ సిమ్‌కార్డు లేదా ఫోన్ దొంగతనానికి గురైన సందర్భాల్లో ఈ కోడ్ మీకు ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి మీ వాట్సాప్ ఖాతాను వినియోగించకుండా అడ్డుకుంటుంది. టు-స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించిన ఆరుఅంకెల కోడ్ ఎవరితోనూ పంచుకోవద్దని వాట్సాప్ సూచిస్తోంది. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ కోడ్‌ను రీసెట్ చేసేందుకు ఎటువంటి రిక్వెస్టు పంపించకుండానే ఇ-మెయిల్ వస్తే ఆ లింకుపై క్లిక్ చేయొద్దని చెప్తోంది.
- మీ వ్యక్తిగత వివరాలను ఎవరు చూడాలో నియంత్రించేందుకు మీ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పు చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్థితి, ఎబౌట్, స్టేటస్ వంటివి కేవలం కాంటాక్టుల్లో ఉన్న వ్యక్తులే చూడాలా? ఎవరైనా చూడొచ్చా? అనేది ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలను మీ పరిచయస్థులకు మాత్రమే కనిపించేలా ఉంచడం వల్ల మోసపూరిత వ్యక్తుల నుంచి మీ ఖాతాలను రక్షించుకోవచ్చు.
- వాట్సాప్ గ్రూప్‌ల్లో చేరికకు సంబంధించిన మరో ఫీచర్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో గ్రూప్ ఇన్వైట్. ఒకవేళ ఎవరు పడితే వారు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయకుండే ఉండేందుకు ఈ ఆప్షన్ పనికొస్తుందని వాట్సాప్ చెప్తోంది.
- మీ వాట్సాప్ ఏయే డివైజులకు కనెక్ట్ అయ్యి ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలని వాట్సాప్ వినియోగదారులకు సూచిస్తోంది. లింక్ డివైజ్ ఆప్షన్‌లోకి వెళితే మీరు ఏయే డివైజులకు కనెక్ట్ అయ్యారో చూపిస్తుంది. ఒకవేళ గుర్తు తెలీని డివైజ్ లిస్ట్ మీకు కనిపిస్తే వెంటనే లాగౌట్ అవ్వడం మంచిది. వాట్సప్ వెబ్/డెస్క్‌టాప్ ద్వారా ఎవరైనా మీ ఖాతాను ఉపయోగిస్తున్నారని అనుమానం వచ్చినా మీ ఫోన్ ద్వారా అన్ని కంప్యూటర్‌ల నుంచి లాగవుట్ అవ్వాలని వాట్సాప్ చెప్తోంది.
- ఇటీవల అంతర్జాతీయ కాల్స్ పెరిగిన నేపథ్యంలో గుర్తు తెలీని కాల్స్‌ను నిరోధించేందుకు వాట్సాప్ మరో టిప్ సూచిస్తోంది. వాట్సాప్ నంబర్‌కు గుర్తు తెలీని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్/ సందేశాలు వచ్చినప్పుడు అవి సందేహాస్పదంగా ఉంటే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండని వాట్సాప్ సూచిస్తోంది. దీనివల్ల మున్ముందు ఆయా ఖాతాల నుంచి మీకు కాల్స్ గానీ, మెసేజులు గానీ రావని వాట్సాప్ చెబుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు
-
Politics News
Andhra News: ఎంపీ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
-
Sports News
CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్
-
World News
Donald Trump: నేను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ హక్కు ఉండదు: ట్రంప్
-
Politics News
MLC Kavitha: బ్రిజ్ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత