Whatsapp: వాట్సాప్‌లో ఫోన్‌ నంబర్‌కు బదులు యూజర్‌ నేమ్‌!

WhatsApp username: వాట్సాప్‌లో కొత్తగా యూజర్‌ నేమ్‌ పెట్టుకునే సదుపాయం రానుంది. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులకు ఫోన్‌ నంబర్‌ను ఇవ్వకుండానే వారితో వాట్సాప్‌లో చాట్‌ చేయొచ్చు.

Published : 26 May 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (Whatsapp) మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు ఇకపై తమ ఖాతాలకు యూజర్‌ నేమ్‌లు (Username) పెట్టుకునే సదుపాయం తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్‌ చేస్తోందని, భవిష్యత్‌లో తీసుకొచ్చే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ పేర్కొంది.

ప్రస్తుతం మన వాట్సాప్ ప్రొఫైల్‌ వివరాల్లోకి వెళితే.. ప్రొఫైల్‌ పిక్‌, పేరు, అబౌట్‌, ఫోన్‌ నంబర్‌ దర్శనమిస్తాయి. ఇకపై వీటితోపాటు యూజర్‌నేమ్‌ కూడా కనిపించనుంది. ఈ యూజర్‌ నేమ్‌ను మనమే క్రియేట్‌ చేసుకోవచ్చు. ‘@’ సింబల్‌తో మొదలయ్యే ఈ యూజర్‌ నేమ్‌ను మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైనా వాట్సాప్‌ యూజర్‌తో మనం చాట్‌ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం తప్పనిసరి. ఇకపై కొత్త వ్యక్తులకు నంబర్‌ బదులు వాట్సాప్ యూజర్‌ ఐడీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం వాట్సాప్‌ ఏ ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తోందన్నది తెలియరాలేదు. పైగా వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందన్నదీ చూడాలి. ఫోన్‌ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండా ఉండడానికా? లేదంటే ఫోన్‌ నంబర్‌ లేకపోయినా ఏ యూజర్‌తోనైనా సంభాషించడానికా? అనేది త్వరలో తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలో బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని