WhatsApp: లాక్ చాట్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
WhatsApp: వ్యక్తిగత చాట్లను ఇతరులెవరూ చూడకుండా లాక్ చాట్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సప్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
WhatsApp | ఇంటర్నెట్ డెస్క్: యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ (WhatsApp) అభివృద్ధి చేస్తోంది. దీనితో యూజర్లు తమ ప్రైవేట్ చాట్లకు లాక్ విధించుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్లపై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉండనుంది. తద్వారా గోప్యతతో పాటు, భద్రత మరింత పెరగనుంది.
ఒకసారి చాట్‌ను లాక్ (Lock Chat) చేస్తే.. కేవలం యూజర్ మాత్రమే ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్ ద్వారా దాన్ని చూడగలుగుతారని వాబీటా పేర్కొంది. ఫలితంగా ఇతరులెవరూ లాక్ చేసిన చాట్‌ను తెరవడం కుదరదు. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకొని లాక్ చేసిన చాట్‌ను పాస్‌కోడ్ లేదా ఫింగర్‌ప్రింట్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అలాగే లాక్ చేసిన చాట్‌లో వచ్చిన ఫొటోలు, వీడియోలు నేరుగా డివైజ్ గ్యాలరీలో సేవ్ కావని వాబీటా పేర్కొంది.
ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీన్ని అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెడతారనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటు యూజర్ల టైపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పెంచేలా అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్లతో కూడిన ‘టెక్ట్స్ ఎడిటర్’ అనే ఫీచర్‌పైన కూడా వాట్సాప్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్