WhatsApp: ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సప్‌ బంద్‌.. జాబితాలో మీ మొబైల్‌ ఉందా?

WhatsApp: త్వరలోనే కొన్ని మొబైల్‌ ఫోన్లలో వాట్సప్‌ తన సేవల్ని నిలిపి వేయనుంది. దీనికి సంబంధించిన జాబితాను కెనాల్‌టెక్‌ విడుదల చేసింది.

Published : 27 Jun 2024 00:15 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్ల అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు తీసుకురావడంతో పాటు తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp). ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్‌లో తన సేవల్ని ఆపేయనుంది. దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్‌టెక్‌ (CanalTech) విడుదల చేసింది. అందులో ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన 35 రకాల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి.

శాంసంగ్‌: గెలాక్సీ Ace ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌ 2, గెలాక్సీ గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, గెలాక్సీ ఎస్‌3 మినీ, గెలాక్సీ ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌.
మెటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్‌
యాపిల్‌: ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6 ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ
హువావే: Ascend P6 S, Ascend G525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1ఎస్‌, హువావే వై625
లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890
సోనీ: Xperia Z1, Xperia E3
ఎల్‌జీ: ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7

ఐపీ రేటింగ్‌ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?

పై పేర్కొన్న జాబితాలో ఉన్న ఫోన్లలో వాట్సప్‌ సదుపాయం రానున్న రోజుల్లో నిలిచిపోనుంది. ఒకవేళ ఎవరైనా వాడుతున్నట్లయితే కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ సపోర్ట్‌ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి. అంతేకాదు భద్రతా పరమైన సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. అదే అప్‌గ్రేడ్‌ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం వాట్సప్‌ సపోర్ట్‌ పేజీని సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని